Urine Infections: యూరిన్ ఇన్‌ఫెక్షన్ కేసులు సాధారణంగా మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో చిన్నారులు, యువతుల్లో అధికంగా కన్పిస్తోంది. సకాలంలో ఈ సమస్యకు చికిత్స చేయించాల్సి ఉంటుంది. అసలు ఈ సమస్య ఎంత ప్రమదకరం, కారణాలేంటో తెలుసుకుందాం.
యూరిన్ ఇన్‌ఫెక్షన్ కేసులు చిన్నారులు, బాలికల్లో పెరగడానికి ప్రదాన కారణం తక్కువ నీరు తాగడం ఒకటైతే ముత్రాన్ని ఎక్కువ సేపు నియంత్రించడం. పాఠశాలల్లో వాష్‌రూమ్‌కు వెళ్లడం ఇష్టం లేక చాలామంది బాలికలు మూత్రాన్ని బలవంతంగా నియంత్రిస్తుంటారు. దాంతో మూత్రాశయంలో బ్యాక్టిరియా పెరుగుతుంటుంది. అంతేకాకుండా అపరిశుభ్రంగా ఉన్న మురుగుదొడ్లు ఉపయోగించడం కూడా మరో ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనివల్ల యూరిన్ ఇన్‌ఫెక్షన్ సమస్య మరింతగా పెరుగుతుంది.
యూరిన్ ఇన్‌ఫెక్షన్ సమస్య ఉంటే మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మంట గమనించవచ్చు. తరచూ మూత్ర విసర్జన, మూత్రంలో రక్తం కారడం, జ్వరం, అలసట, పొత్తి కడుపులో నొప్పి వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి.
అందుకే ఈ సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. బాలికలు బయట వాష్‌రూమ్స్ వాడేటప్పుడు హైజీన్ ఉండేట్టు చూసుకోవాలి. బాలికలు ఎక్కువసేపు మూత్రం ఆపుకోకుండా చూసుకోవాలి. రోజూ తగినంత నీరు తప్పకుండా తాగాలి. హెల్తీ డైట్ మాత్రమే తినాలి.
Also read: PM Svanidhi Scheme: ఆధార్ కార్డు ఒక్కటి ఉంటే చాలు..2.5 లక్షలు పొందే అవకాశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి