Eye Healthy Foods: చాలామంది పిల్లల నుంచి కంటి చూపు సమస్యతో బాధపడుతుంటారు. చదివేటప్పుడు కూడా కంటి అద్దాలు లేనిది వారికి ఏ అక్షరం కూడా కనిపించదు. దీనికి లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం వల్ల కూడా ప్రధాన కారణం. మనం తీసుకునే ఆహారం కంటే ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలో ఉండాలి. కొన్ని రకాల ఆహారాలు డైట్ లో చేర్చుకోవడం వల్ల మీ కంటి చూపు మెరుగవుతుంది. ఇక కంటికి ఉన్న అద్దాలను కూడా తీసి పక్కన పెట్టేయాలంటే కొన్ని ఆహారాలు తినాలి.ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం
పాలకూర..
పాలకూరలో లూటీన్, గ్జియాంతీన్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కెరోటినాయిడ్స్ ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. హానికర యూవీ కిరణాల నుంచి కంటిని కాపాడుతాయి.. ఆక్సిడేటివ్ డ్యామేజ్ కాకుండా నివారిస్తాయి. పాలకూరలో ఉండే విటమిన్ సి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పాలకూర రెగ్యులర్‌గా చేర్చుకోవడం వల్ల కడుపు ఆరోగ్యానికి మాత్రమే కాదు.. కంటి చూపు కూడా మెరుగవుతుంది. వయసు రీత్యా వచ్చే కంటి సమస్యలు కూడా పాలకూర చెక్ పెడుతుంది.
క్యారట్..
క్యారట్‌లో కూడా కంటి చూపు మెరుగుపరిచే గుణాలు ఉంటాయి. ఇందులోని బీటా కెరోటీన్ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇది విటమిన్ ఏ గా మారుతుంది. రెటీనాను కాపాడుతుంది. మంచి కంటి చూపుకు ప్రేరేపిస్తుంది. విటమిన్ ఏ లేమితో బాధపడుతున్న వారికి కచ్చితంగా కంటి చూపు సమస్య ఉంటుంది. వారు క్యారెట్ ని డైట్ లో చేర్చుకోవడం వల్ల కంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. దీన్ని జ్యూస్ రూపంలో లేదా నేరుగా కూడా తినవచ్చు.
బ్లూబెర్రీ..
బ్లూబెర్రీ లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో విటమిన్ సి, ఇ కూడా ఉండటం వల్ల ఆక్సిడేటీవ్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. కంటి సమస్య రెటీనా డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. బ్లూబెర్రీ పండు కూడా కంటి నరాలకు ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కంటి సమస్యలు రాకుండా నివారిస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్‌తో బాధపడే వారికి రెటినోపతి నుంచి కాపాడుతుంది.
గింజలు, విత్తనాలు..
గింజలు, విత్తనాలు డైట్లో చేర్చుకోవడం వల్ల కూడా కంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. పిల్లలకు స్నాక్ రూపంలో ఈ గింజలు, విత్తనాలు డైట్లో చేర్చండి. ముఖ్యంగా వాల్నట్స్, అవిస గింజల్లో విటమిన్ ఇ, ఒమేగా 3s కూడా ఉంటుంది. దీంతో ఇన్‌ఫ్లమేషన్ సమస్యను నివారిస్తుంది. మీ కంటి సెల్ డామేజ్ కాకుండా కాపాడుతుంది. గింజలు డైట్ లో చేర్చుకోవడం వల్ల డ్రై ఐ సిండ్రోమ్ నుంచి కూడా బయటపడతారని కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి.
గుడ్లు ..
గుడ్లు ఇవి పోషకాలకు పవర్ హౌస్. కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఇందులో కూడా లూటీన్, గ్జియాంథీన్ ఉంటుంది. హానికర బ్లూ కిరణాల నుంచి కంటిని కాపాడుతుంది. గుడ్లలో జింక్ ఉంటుంది. ఇది కంటి రెటీనాను కాపాడుతుంది గుడ్లు డైట్ లో చేర్చుకోవడం ఎంతో ముఖ్యం.
ఇదీ చదవండి: ఈఎంఐ కట్టేవారికి అదిరిపోయే న్యూస్.. రెపోరేట్ తగ్గించిన ఆర్‌బీఐ..
ఆరెంజ్..
ఆరెంజ్ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది కూడా కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. క్యాటరాక్ట్ సమస్యలు దరిచేరినివ్వదు. కంటి నరాల ఆరోగ్యానికి ప్రేరేపిస్తుంది. ఆరేంజ్ తరచూ తీసుకునే వారిలో కంటిచూపు మెరుగ్గా ఉంటుంది.
ఎర్ర క్యాప్సికం..
ఎరుపు రంగులో ఉండే క్యాప్సికమ్‌లో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది క్యాటరోయిడ్ కలిగి ఉంటుంది. బీటా కెరోటీన్, లైకోపీన్ కూడా ఉండటం వల్ల ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది వయస్సురీత్యా వచ్చే కంటి సమస్యలను నివారిస్తుంది. ఇది కాకుండా మన డైట్ లో టమాటాలను కూడా చేర్చుకోవాలి. వీటిలో కూడా లైకోపీన్, విటమిన్ సి ఉంటుంది ఇది హానికరం యూవీ కిరణాల నుంచి మన కంటిని కాపాడుతుంది.
ఇదీ చదవండి: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వాట్సాప్‌లో ఇంటర్ హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.