Swapnala Nava: సిరివెన్నెల సీతారామశాస్త్రికి 'స్వప్నాల నావ' సాంగ్ అంకితం: డైరెక్టర్ వీఎన్ ఆదిత్య

Swapnala Nava Song: దిగ్గజ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి  అంకితం ఇస్తూ.. 'స్వప్నాల నావ' అనే వీడియో సాంగ్ రూపొందుతోంది. శ్రీజ కొటారు స్వయంగా ఆలపించి నటిస్తుండగా.. ప్రముఖ డైరెక్టర్ వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Jan 4, 2025, 06:39 PM IST
Swapnala Nava: సిరివెన్నెల సీతారామశాస్త్రికి 'స్వప్నాల నావ' సాంగ్ అంకితం: డైరెక్టర్ వీఎన్ ఆదిత్య

Swapnala Nava Song: స్టాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ.. డల్లాస్‌లో స్థిరపడిన తెలుగు వ్యక్తి గోపీ కృష్ణ కొటారు శ్రీ క్రియేటివ్ మ్యూజిక్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను మొదలుపెట్టారు. తన కుమార్తె శ్రీజ కొటారు స్వయంగా ఆలపించి.. నటించిన 'స్వప్నాల నావ' అంటూ సాగే సాంగ్ వీడియో షూటింగ్‌ను మొదటి ప్రయత్నంగా ప్రారంభించారు. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఈ పాటను అంకితం చేయనున్నారు. ఓఎమ్‌జీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్‌ మీనాక్షి అనిపిండి సమర్పిస్తున్నారు.

పార్ధసారధి నేమాని స్వరాలు అందించగా.. యశ్వంత్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు వీ.ఎన్.ఆదిత్య చిత్రీరించారు. బుజ్జి.కే సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశారు. ఈ సాంగ్‌ను పూర్తిగా అమెరికాలోని డల్లాస్‌ నగరంలో చిత్రీకరించారు. స్వప్నాల నావ పాట పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. త్వరలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీడియో లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.  

ఈ సందర్భగా జరిగిన వీడియో లాంచ్ కార్యక్రమంలో నిర్మాత గోపీకృష్ణ కొటారు, కుమారి శ్రీజ కొటారును ప్రశంసించారు. గోపీకృష్ణ మాట్లాడుతూ.. సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తనకు ఎంతో అభిమానం అని.. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన భావజాలం ప్రతి ఒక్కరి హృదయాలను తాకుతుందని చెప్పారు. ఆయన ఉంటే నేటి తరం యువతకు తన సాహిత్యం ద్వారా ఎలాంటి సందేశం అందిస్తారో అనే ఆలోచనలతో ఈ సాంగ్ మొదలైందన్నారు.

అనంతరం పార్ధసారథి నేమాని మాట్లాడుతూ.. ప్రస్తుతం నేటి యువత ప్రతి చిన్న విషయానికి యువత నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారని అన్నారు. సిరివెన్నెల లాంటి గొప్ప వ్యక్తి ఇచ్చిన సాహిత్యాన్ని ప్రేరణగా తీసుకుని పిల్లల కోసం ఈ పాట చేశామని చెప్పుకొచ్చారు. ఈ సాంగ్‌ను పాడిన శ్రీజకు ప్రొఫెషనల్‌ సింగర్ అయ్యే లక్షణాలు ఉన్నాయని అన్నారు. ఎన్నో పెద్ద మూవీస్‌ను డైరెక్ట్ చేసిన వీఎన్ ఆదిత్య.. ఈ  పాటకు దర్శకత్వం వహించడం గొప్ప విషయమని చెప్పారు. 

దర్శకుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. గోపీకృష్ణ కొత్త జర్నీ ప్రారంభించారని.. ఆయన ప్రయణం విజయవంతం కావాలని కోరుకున్నారు. శ్రీజ ప్రతిభ, గాత్రం చూస్తే ప్రొఫెషనల్ సింగర్‌గా అనిపించిందనన్నారు. సాంగ్ పూర్తయిన తరువాత అరంగేట్రం చేసిన సింగర్‌లా అనిపించలేదని అన్నారు. సాధ్యమైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని అన్నారు. 

Trending News