Tollywood Top 1 Chair: తెలుగు సినీ పరిశ్రమ రోజురోజుకు విస్తరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దర్శకులు రాజమౌళి, సుకుమార్, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి లాంటి వారు పరిశ్రమను కొత్త స్థాయికి తీసుకువెళ్తున్నారు. ఇక్కడి స్టార్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిని దాటి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలోని స్టార్ హీరోలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటులు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగులో ఈ జనరేషన్ టాప్ వన్ హీరో ఎవరు అనేదానిపై ఎన్నో రోజుల నుంచి చర్చ జరుగుతూ ఉండడం మనకు తెలిసిన విషయమే.
సాధారణంగా తెలుగులో టాప్ వన్ హీరో ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు సీనియర్ ఎన్టీఆర్. అప్పటి జనరేషన్ నుంచి ఇప్పటి జనరేషన్ వరకు వివరంగా సినిమా వారి పేరు చెప్పాలి అంతే..ముందుగా సీనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పే ఆ తర్వాత ఎంతోమంది హీరోలను తలుచుకుంటూ ఉంటారు. అంతలా ఇండస్ట్రీలో చిరస్మనీయంగా పేరు తెచ్చుకున్నారు ఈ హీరో.
ఇక సీనియర్ ఎన్టీఆర్ తరువాత చిరంజీవి, బాలకృష్ణ మధ్య మంచి పోటీ నడవగా..గత జనరేషన్లో కొన్ని సూపర్ హిట్ల ద్వారా చిరంజీవి మొదటి స్థానం సంపాదించుకున్నారు. అక్కడితో పోయిన జనరేషన్ పోటీ కూడా ముగిసింది. కానీ ప్రస్తుత జనరేషన్లో మాత్రం ఎవరు టాప్ వన్ ప్లేస్ అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే ఇప్పుడు మార్కెట్ ని బట్టి చూస్తుంటే సాధారణ ప్రేక్షకులకు కొంచెం క్లారిటీ వస్తుంది అనిపిస్తుంది.
బాహుబలి తరువాత ప్రభాస్ హిందీ మార్కెట్‌లో కూడా తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. "పుష్ప తో అల్లు అర్జున్, ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా దేశవ్యాప్తంగా క్రేజ్ పెంచుకున్నారు.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఓ భారీ చిత్రం చేస్తున్నాడు. దీన్ని పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన భాషల్లో సినిమాను విడుదల చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇది తెలుగు సినిమాకు మరో మైలురాయి కానుంది.
తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోల మధ్య నెంబర్ వన్ పోటీ నిత్యకల్యాణం. గతంలో ఒకసారి నెంబర్ వన్ స్థానంలో నిలిచిన హీరో, ఆ స్థానాన్ని కొంత కాలం నిలుపుకోగలిగేవారు. అయితే, ఇప్పుడు పరిస్థితులు మారాయి. బాక్సాఫీస్ వద్ద ఎవరి సినిమా ఎక్కువ వసూళ్లు సాధిస్తుందో, ఆ హీరోనే నెంబర్ వన్ గా పరిగణిస్తున్నారు. సినిమా ఫ్లాప్ అయితే వెంటనే దాని ప్రభావం పడుతుంది. అందుకే ఒకప్పుడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వేరే టాప్ హీరోలు అనుకోక ఇప్పుడు మాత్రం ఆ లెక్కలు అన్ని మారుతూ కనిపిస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రస్తుతం అభిమానుల పరంగా లేకపోతే మార్కెట్ పరంగా చూస్తే.. ప్రభాస్.. అల్లు అర్జున్ వీరిద్దరిలోనే ఎవరికో ఒకరికి మొదటి స్థానం షురూ అనేలా కనిపిస్తోంది. అయితే ఈ స్థానానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా పెద్ద దూరంగా లేరు. ఒక రెండు మూడు బ్లాక్ బస్టర్లు ఇవ్వగలిగితే.. ఈ హీరో వారిద్దరినీ కూడా దాటేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోపక్క రాజమౌళి సినిమాతో మహేష్ బాబు కూడా ఈ స్థానంపై కన్నేశారు. అయితే వీరందరూ కూడా భవిష్యత్తులో మొదటి స్థానం కోసం పోటీపరుతున్న వారు. ప్రస్తుతం మాత్రం ఆ కుర్చీలో ప్రభాస్, అల్లు అర్జున్ కూర్చొని ఉన్నారు అని అనడంలో సందేహం లేదు.
Also Read: Tirumala Ratha Saptami: రథ సప్తమి పర్వదినం సందర్బంగా తిరుమలలో ఏడు వాహనాలపై ఊరేగనున్న మలయప్ప స్వామి..
Also Read: Telangana BC Survey: ఇవాళే కులగణన నివేదిక.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.