Thandel Real Hero: మత్స్యకారులు జీవితాల్లో జరిగిన నిజమైన ఘటనల ఆధారంగా తెరకెక్కిన తండేల్ సినిా ఫిబ్రవరి 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలై విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతోంది. అదే సమయంలో తండేల్ ఘటన రియల్ హీరో వైఎస్ జగన్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అసలు తండేల్ సినిమాకు, వైఎస్ జగన్‌కు సంబంధమేంటో చూద్దాం..
శ్రీకాకుళం జిల్లా డి మత్స్యలేశం గ్రామానికి చెందిన కొందరు మత్స్యకారులు పొట్టకూటి కోసం గుజరాత్ పోర్ట్‌కు వెళ్లి అక్కడి నుంచి అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లో ప్రవేశించి అరెస్ట్ అవుతారు. మొత్తం 22 మంది మత్స్య కారులు పాకిస్తాన్ జైళ్లో బందీలుగా ఉంటారు. ఈ ఘటన 2018 నవంబర్ 28న జరుగుతుంది. పాకిస్తాన్ చెర నుంచి ఎలా బయటపడ్డారు, ఇందులో రాజు-సత్యల ప్రేమ కధ ఏంటనేది ఫిక్షనల్‌గా ఉంటుంది. మత్స్యకారుల జీవన నేపధ్యం, పాకిస్తాన్ చెరలో బందీలుగా మారడం, ప్రేమ నేపధ్యం, భాష తెలియకుండా పడిన ఇబ్బందులు , అక్కడ్నించి ఎలా బయటపడ్డారనేది ఆద్యంతం ఆసక్తిగా అద్భుతంగా మలిచారు దర్శకుడు. అయితే ఈ మత్స్యకారులు ఎలా బయటపడ్డారనే విషయంలోనే ఓ చర్చ ప్రారంభమైంది. ఆ చర్చే ఈ సినిమాకు రియల్ హీరో వైఎస్ జగన్ అనే ప్రచారం చేయిస్తోంది. అసలు వాస్తవం ఏంటి, జగన్‌కు ఈ సినిమాకు సంబంధమేంటో చూద్దాం.
శ్రీకాకుళం మత్స్యకారులు పాకిస్తాన్ చెరలో బందీలుగా ఉన్నప్పుడు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వారిని విడుదల చేయించడంలో విఫలమైంది. మత్స్యకారుల కష్టాల్ని పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో రాజాం ప్రాంతంలో నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్రలో భాగంగా ఆ మత్స్యకారుల బాధలు తెలుసుకున్నారు. అధికారంలో వస్తే విడిపిస్తానని హామీ ఇచ్చారు. హామీ ప్రకారం 2019లో అధికారంలో రాగానే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ 22 మంది మత్స్యకారుల్ని క్షేమంగా స్వదేశానికి రప్పించారు. అంతేకాకుండా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు. అందుకే ఈ కధకు రియల్ హీరో వైఎస్ జగన్ అనే ప్రచారం సోషల్ మీడియాలో గట్టిగా జరుగుతోంది.
అదే సమయంలో ఆ గ్రామంలోని మత్స్యకారులు, గ్రామస్థులు సినిమా యూనిట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారుల్ని విడిపించిన వైఎస్ జగన్ ప్రస్తావన సినిమాలో ఎందుకు పెట్టలేదని నిలదీస్తున్నారు. అందుకే ఈ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.
Also read: 7th Pay Commission DA Arrears: 18 నెలల డీఏ ఎరియర్లు, డీఏ పెంపుపై ప్రభుత్వం కీలక ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి