Vivekanandan Viral OTT:మలయాళ చిత్ర పరిశ్రమలో షైన్ టామ్ చాకోకి మంచి క్రేజ్ ఉంది. చాలా సింపుల్‌గా కనిపిస్తూనే పవర్ ఫుల్ విలనిజం పండిచడంలో దిట్ట. తాజాగా ఈయన డిఫరెంట్ కంటెంట్‌తో కూడిన ‘వివేకానందన్ విరలను’ అనే చిత్రం చేశారు. లాస్ట్ ఇయర్ జనవరి 19న విడుదలైన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అలాంటి ఈ సినిమాను ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కోసం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది. ప్రతి వారం కొత్త సినిమాతో అలరిస్తోంది ఆహా ఓటీటీ. తాజాగా సబ్‌స్క్రైబర్ల కోసం ప్రతి శుక్రవారం కొత్త సినిమాలను అందించే ఆహా ఓటీటీ ఈ ఫ్రైడే ‘వివేకానందన్ వైరల్’ పేరుతో సరికొత్త రొమాంటిక్ కామెడీ డ్రామాను అందించబోతోంది.
ఈ సినిమాలో షైన్ టామ్ చాకో సరసన ఐదుగురు కథానాయికలు నటించారు. శ్వాసిక విజయ్, గ్రేస్ ఆంటోని, మెరీనా మైఖేల్, రమ్య సురేశ్, మంజు పిళ్లై లీడ్ రోల్స్ లో యాక్ట్ చేశారు. కామెడీ డ్రామా జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమాకి సీనియర్ దర్శకుడు కమల్ డైరెక్ట్ చేశారు.
‘వివేకానందన్ వైరల్’ కథ విషయానికి వస్తే.. ఇద్దరు భార్యలను చేసుకొని, వాళ్లను వేధిస్తూ తిరిగే ఓ భర్త.. అతనికి బుద్ది చెప్పేందుకు వాళ్లు చేసే ప్రయత్నం చుట్టూ తిరిగే స్టోరీతో తెరకెక్కింది. వివేకానందన్ మంచి విలాస పురుషుడు .. ఆపై శృంగారం అంటే మక్కువ ఎక్కువ. ఆయన భార్య సితార ఓ పల్లెటూళ్లో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటుంది. తన ఉద్యోగం సిటీలో కావడం.. భార్య ఇంట్లో లేకపోవడంతో వివేకానందన్ ఇల్లీగల్ ఎపైర్స్ కొనసాగిస్తూ ఉంటాడు. అతని అసలు స్వరూపం తెలుసుకున్న వాళ్లంతా కలిసి ఏం చేశారు? వివేకానందన్ ఎలాంటి చిక్కుల్లో పడతాడు? అనేది ఈ సినిమా మెయిన్ పాయింట్.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ఆకట్టుకునే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ప్రతి క్షణం ఆసక్తిగా ఎంటర్‌టైన్ చేసే ‘వివేకానందన్ వైరల్’ సినిమాను భవానీ మీడియా ద్వారా ఆహా ఓటీటీ ఫిబ్రవరి 7 (శుక్రవారం) నుంచి స్ట్రీమింగ్ కు రానుంది. షైన్ టామ్ చాకో 100వ చిత్రంగా వచ్చిన ఈ సినిమాను రేపు ఆహా ఓటీటీలో చూడండి.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.