Yash Tweet: రాకింగ్ స్టార్ యశ్.. కె.జి.యఫ్ సినిమాలతో గ్లోబల్ రేంజ్‌లో స్టార్‌గా ఎదిగిన ప్రముఖ నటుడు. తన అభిమానులను ఎంతో ప్రేమించే యష్, వారిని ఉద్దేశించి తాజాగా హృదయపూర్వకమైన లేఖ రాశారు. ఈ లేఖలో తన పుట్టినరోజు సందర్భంగా జరిగే వేడుకల విషయంలో తమ ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వేడుకల కంటే జీవితంలో గొప్ప లక్ష్యాలను సాధించడం ముఖ్యం అని ఆయన అభిప్రాయపడ్డారు.
తన లేఖలో యష్ గత పుట్టినరోజు వేడుకల సమయంలో జరిగిన కొన్ని దురదృష్టకర సంఘటనలను ప్రస్తావించారు. 2023 జనవరిలో యష్ పుట్టినరోజు సందర్భంగా, కర్ణాటకలో ముగ్గురు అభిమానులు భారీ కటౌట్ ఏర్పాటు చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనల తర్వాత యష్ కుటుంబాలను వ్యక్తిగతంగా సందర్శించి వారికీ మద్దతు ప్రకటించారు. అలాగే, ఇటువంటి ప్రమాదకర చర్యలను మానుకోవాలని తన అభిమానులను కోరారు.
"అభిమానంగా మీ జీవితాన్ని సురక్షితంగా ఉంచడం, నా కోసం మీరు ఇచ్చే నిజమైన గౌరవం" అని యష్ అన్నారు. పుట్టినరోజు వేడుకల్లో బ్యానర్లు కట్టటం, ప్రమాదకర రీతిలో బైక్ రేసులు చేయడం, నిర్లక్ష్యపు సెల్ఫీలు తీసుకోవడం వంటి చర్యల్ని విరమించాలని అభ్యర్థించారు. 2019లో పుట్టినరోజు సందర్భంగా ఒక అభిమాని యశ్ను కలవలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటనను ప్రస్తావిస్తూ, అభిమానుల తాత్కాలిక నిర్ణయాలు భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెప్పారు.
తన పుట్టినరోజు వేడుకలను అభిమానులు జరుపుకునే తరుణంలో, వారి భద్రతకు పెద్దపీట వేయడం తనకెంతో ముఖ్యమని యష్ పేర్కొన్నారు. అభిమానుల బాగోగులు తనకు అత్యంత ప్రాధాన్యమని, వారు సురక్షితంగా ఉండటం తనకు గొప్ప బహుమతిగా భావిస్తానని తెలిపారు.
ప్రస్తుతం యశ్ "టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్" అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో నిర్మితమవుతోంది. కె.వి.ఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
ఇక రాకింగ్ స్టార్ యష్ అభిమానుల పట్ల చూపే ప్రేమ, కృతజ్ఞత వారి హృదయాలను గెలుచుకుంటోంది. యష్ సూచనలు అందరూ గౌరవించి, ఆరోగ్యం, భద్రతకు పెద్దపీట వేయాలని సోషల్ మీడియాలో మిగతా సినీ అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
Also Read: KT Rama Rao: నన్ను జైలుకు పంపడమే రేవంత్ రెడ్డి లక్ష్యం.. అవినీతి లేదు ఏం లేదు
Also Read: Harish Rao: హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్‌ను కంటతడి పెట్టించింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.