Pushpa 2 OTT: పది నిమిషాలు ఎవ్వరూ చూడని సీన్స్ లో సిద్ధమవుతున్న పుష్ప 2..!

Pushpa 2 OTT Update : అల్లు అర్జున్,సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం పుష్ప 2. గత ఏడాది డిసెంబర్ ఐదవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయం సొంతం చేసుకుంది. ఇపుడు ఈ సినిమా ఓటిటిలో మరిన్ని సీన్స్ లో మన ముందుకి రానుంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jan 20, 2025, 03:33 PM IST
Pushpa 2 OTT: పది నిమిషాలు ఎవ్వరూ చూడని సీన్స్ లో సిద్ధమవుతున్న పుష్ప 2..!

Exclusive Scenes in Pushpa OTT: గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం పుష్ప2. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఇప్పటికే దాదాపు రూ.1850 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇకపోతే ఈ సినిమాలో ఇప్పటివరకు చూడని 20 నిమిషాల సన్నివేశాలను జోడించి,  జనవరి 17వ తేదీ నుంచి పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ అంటూ మళ్ళీ విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇక దీనికి అభిమానులలో పూనకాలు వచ్చేశాయి.  అయితే ఇప్పుడు మరో సరికొత్త సన్నివేశాన్ని కూడా జోడిస్తూ ఓటీటీ లోకి తీసుకురాబోతున్నామంటూ మేకర్స్ ప్రకటించారు. అయితే ఈసారి 10 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను జోడించి, ఓటీటీ నెట్ఫ్లిక్స్ లోకి విడుదల చేయబోతున్నారట. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు.

ఇప్పటికే రీలోడెడ్ వర్షన్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న పుష్ప2 ఓటీటిలోకి వచ్చిన తర్వాత మరో 10 నిమిషాల సన్నివేశంతో ఎలా ఆకట్టుకోబోతోందని అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. ఇకపోతే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే పుష్ప 2 తో లెక్కలు పెంచాలి అని,  రికార్డ్స్ బ్రేక్ చేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ముఖ్యంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 2000కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన దంగల్ సినిమా రికార్డ్స్ బ్రేక్ చేయాలనే ఉద్దేశంతోనే ఇలా సరికొత్తగా సన్నివేశాలను ఆడ్ చేస్తూ రిలీజ్ చేస్తున్నారట సుకుమార్. ముఖ్యంగా ఈ సినిమా ఇన్ని కలెక్షన్లు రాబట్టడానికి కారణం నార్త్ ఇండస్ట్రీ అని, ఇప్పుడు అక్కడి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 ఇన్ని అంచనాల మధ్య ఈ సినిమా ఎటువంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలని అభిమానులు సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News