Spirit: సందీప్ - ప్రభాస్ స్పిరిట్ మూవీ స్టోరీ లీక్.. గూస్ బంప్స్ గ్యారెంటీ..!

Spirit Story:  టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్,  ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్నారు. దీనికి తోడు వరుస సినిమాలు ప్రకటిస్తూ మరింత బిజీగా మారిపోయారు. ఇక చివరిగా కల్కి 2898AD సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్నారు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Dec 13, 2024, 04:56 PM IST
Spirit: సందీప్ - ప్రభాస్ స్పిరిట్ మూవీ స్టోరీ లీక్.. గూస్ బంప్స్ గ్యారెంటీ..!

Spirit Story leaked: రాజమౌళి దర్శకత్వంలో, ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయారు ప్రభాస్. ఆ తర్వాత బాహుబలి 2 సినిమా చేసి పాన్ ఇండియా లెక్కలు మార్చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు. ఆ తర్వాత నుంచి వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు 
అందులో భాగంగానే కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. 

ఇక ఇప్పుడు మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ చేస్తూ ఉండగా మరొకవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమాని కూడా ప్రకటించారు 
ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.  దీనికి తోడు ఈ రెండు చిత్రాలు కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం గమనార్హం. 

ఇదీ చదవండి: ఫామ్ హౌస్ రౌడీ.. ఆది నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదం..

ఇదిలా ఉండగా మరొకవైపు ప్రముఖ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి స్టోరీని కాస్త లీక్ చేసినట్లు వార్తలు అనిపిస్తున్నాయి.

ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తున్న స్పిరిట్ సినిమాకు సంబంధించి స్టోరీ లీక్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో కరీనాకపూర్, కత్రినా కైఫ్ తో పాటు త్రిష వంటి హీరోయిన్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి కానీ ఇవన్నీ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన ఫేక్ న్యూస్ గానే మిగిలిపోయాయి. కాగా ఈ సినిమా నుంచి స్టోరీ లీక్ అవ్వగా అందులో యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ ప్రభాస్ నటించబోతున్నట్లు తెలిసింది. అతని దగ్గరకు వచ్చిన కేసులన్నింటినీ కోర్ట్ వరకు వెళ్లకుండానే పరిష్కరిస్తూ ఉంటాడు ప్రభాస్.  అందుకే అతను అంటే రౌడీలందరికీ హడల్ అలాంటి పోలీస్ అధికారి అనుకోకుండా ఒక ఇంటర్నేషనల్ డ్రగ్ రాకెట్ లో  ఇరుక్కున్నాడు. 

ఈ డ్రగ్ రాకెట్ కారణంగా అవమానాలు ఎదుర్కొంటారు. దాంతో డ్రగ్ రాకెట్ నడిపిస్తున్న మాఫియా మొత్తాన్ని అంతం చేయాలని ఫిక్స్ అవుతాడు. అయితే ఆ మిషన్ ని ఎలా పూర్తి చేశాడనేదే స్పిరిట్ సినిమా స్టోరీ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: Nagababu Cabinet: ముగ్గురు మొనగాళ్లు.. దేశంలోనే మొదటిసారి..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News