Guard Movie Poster : విరాజ్ రెడ్డి చీలం హీరోగా.. అనసూయ రెడ్డి నిర్మాణంలో.. అను ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న యాక్షన్ లవ్ ఎంటర్‌టైనర్ గార్డ్. ప్రస్తుతం ఈ సినిమా.. ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. జగ పెద్ది దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ‘రివెంజ్ ఫర్ లవ్’ అనే ట్యాగ్‌లైన్‌ను తీసుకున్నారు. మిమి లియోనార్డో, శిల్పా బాలకృష్ణన్ హీరోయిన్లుగా నటిస్తుండగా, మెల్‌బోర్న్ నేపథ్యంలో ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపొందింది.
సుశాంత్ అనే 25 ఏళ్ల యువకుడు మెల్‌బోర్న్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తూ, తన స్వంత సెక్యూరిటీ ఏజెన్సీని స్థాపించాలని కలలు కంటాడు. సైకాలజిస్ట్ సామ్‌తో పరిచయం ప్రేమగా మారుతుంది. ఈ క్రమంలో అనుకోని పరిణామాలు అతని జీవితంలో పెద్ద మలుపు తీసుకొస్తాయి. ప్రేమ కోసం సుశాంత్ తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడు, అనుకోని శక్తులతో చేసిన పోరాటం ఏమిటనేది ఈ కథ యొక్క ప్రధాన ఆకర్షణ.
గురువారం ‘గార్డ్’ మోషన్ పోస్టర్ విడుదలైంది. పోస్టర్‌లో హీరో విరాజ్ రెడ్డి చీలం సెక్యూరిటీ గార్డ్ రూపంలో కనిపించగా, హీరోయిన్స్ మిమి లియోనార్డో, శిల్పా బాలకృష్ణన్ ఇన్‌టెన్స్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నారు. సినిమా మొత్తం మెల్‌బోర్న్‌లో చిత్రీకరించబడగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక ఈ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో పాటు ఇంగ్లీష్, చైనీస్ భాషల్లో కూడా విడుదల కానుంది. మేకర్స్ అందించిన సమాచారం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
సిద్ధార్థ్ సదాశివుని సంగీతం అందిస్తుండగా, మార్క్ కెన్‌ఫీల్డ్ సినిమాటోగ్రఫీని చేపట్టారు. రాజ్ మేడ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, ప్రణయ్ కాలేరు సాంగ్స్ కంపోజ్ చేశారు. వంశీ కాకా పి.ఆర్.ఒగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విరాజ్ రెడ్డి చీలం తో పాటు..మిమి లియోనార్డో ,శిల్పా బాలకృష్ణన్, ఇతర ప్రముఖులు ప్రధాన పాత్రలో కనిపించమన్నారు.
ఈ సినిమాతో విరాజ్ రెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. మేకర్స్ తెలిపినట్లుగా మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.
Also Read: Sankranti: సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ పోలీసుల భారీ షాక్.. కోడి పందాలకు బ్రేక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.