Zee Sankranti Celebrations: కల్కి వరల్డ్ ప్రీమియర్ తో పాటు ఎన్నో సంబరాలు.. ఈ సంక్రాంతికి మీ జీ తెలుగులో..!

Sankranti Celebrations: ఈ సంక్రాంతికి ప్రేక్షకుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపేందుకు మరిన్ని సరికొత్త ప్రోగ్రామ్స్ తో వచ్చేస్తోంది జీ తెలుగు. అంతేకాదు ఎప్పటికప్పుడు కొత్త సినిమాలను తెలుగు ప్రేక్షకులను అందించే జీ తెలుగు.. ఈసారి సంక్రాంతికి ఏకంగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కల్కి 2898ఎడి.. సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ వెయ్యనుంది. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jan 9, 2025, 06:58 PM IST
Zee Sankranti Celebrations: కల్కి వరల్డ్ ప్రీమియర్ తో పాటు ఎన్నో సంబరాలు.. ఈ సంక్రాంతికి మీ జీ తెలుగులో..!

Kalki 2898AD World Premiere: తెలుగు పండుగలు, ప్రత్యేక సందర్భాలను వినోదభరిత కార్యక్రమాలతో మరింత ప్రత్యేకంగా.m మార్చే జీ తెలుగు ఈ సంక్రాంతికి మూడు ముచ్చటైన కార్యక్రామాలతో వినోదం పంచేందుకు సిద్దమైంది. 

నూతన సంవత్సరాన్ని ప్రత్యేక కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించిన జీ తెలుగు.. తాజాగా కాకినాడలో విక్టరీ వెంకటేష్ అతిథిగా సంక్రాంతి సంబరాలను ‘సంక్రాంతి సంబరాలకి వస్తున్నాం’ ఈవెంట్తో వైభవంగా నిర్వహించింది. అభిమానుల కోలాహలంతో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని ఈ జనవరి 11న జి ప్రచారం చేయనుంది. ఇక శనివారం సాయంత్రం 6 గంటలకు, పాన్ ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ కల్కి 2898 ఏడీ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా రానుంది.  ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు, సంక్రాంతి సంబరాలు ఫైర్ Vs వైల్డ్ ఫైర్ ప్రత్యేక కార్యక్రమం, సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం చేయనుంది మీ జీ తెలుగు!

కాకినాడ వేదికగా జరిగిన ‘సంక్రాంతి సంబరాలకి వస్తున్నాం’ కార్యక్రమంలో జీ తెలుగు తారలతో పాటు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నుంచి విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, గౌతమి, శ్రీలక్ష్మి, శివపార్వతి, కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, నిర్మాత శిరీష్ పాల్గొని అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. యాంకర్ రవి, అషు రెడ్డి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన అద్భుతమైన ప్రదర్శనలు, సరదా సంభాషణలతో సందడిగా సాగింది. 

ఈ సంక్రాంతి సంబరాల్ని మరింత ప్రత్యేకంగా మార్చేందుకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ బ్లాక్ బస్టర్ కల్కి 2898 ఏడీ సినిమాని అందిస్తోంది.. జీ తెలుగు. పురాణాలు, సైన్స్ ఫిక్షన్, అదిరిపోయే విజువల్స్ మేళవించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె వంటి నటుల అద్భుత నటన ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులను మెప్పించి బిగ్గెస్ట్ హిట్గా నిలిపింది. 

ఈ సినిమా చూసే ప్రేక్షకులకు జీ తెలుగు మరో అద్భుత అవకాశం కల్పిస్తోంది. Watch & Win కాంటెస్ట్ని నిర్వహిస్తోంది జీ తెలుగు. మీరు చేయాల్సిందల్లా కల్కి సినిమా చూస్తూ టీవీ స్క్రీన్పై వచ్చే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం లేదా www.kalkionzeetelugu.zee5.com  లో లాగిన్ అయి కల్కి గేమ్ ఆడి అదిరిపోయే బహుమతులు గెలవచ్చు. ఈ కాంటెస్ట్లో గెలిచిన మొదటి అయిదుగురు కల్కి 2 సెట్స్ సందర్శన, 100 మంది కల్కి థీమ్తో అదిరిపోయే బహుమతులు అందుకోవచ్చు.ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ కాంటెస్ట్లో పాల్గొనండి!

జీ తెలుగు సంక్రాంతి సంబరాలకి కొనసాగింపుగా సంక్రాంతి సంబరాలు ఫైర్ Vs వైల్డ్ ఫైర్ కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానుంది. యాంకర్ రవి, వర్షణి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు, జీ తెలుగు తారలు అత్తలు, కోడళ్లు పేరున రెండు టీమ్లుగా ఏర్పడి వినోదం పంచేందుకు పోటీపడ్డారు. బేబీ సినిమా ఫేమ్ వైష్ణవి చైతన్య, యాంకర్ ప్రదీప్ మాచిరాజు, వందేమాతరం శ్రీనివాస్,సీనియర్ హీరోయిన్ రాధ, మన్మథుడు సినిమా ఫేమ్ అన్షు, దర్శకుడు, నటుడు ఎస్.జె.సూర్య హాజరై అందరిలో మరింత ఉత్సాహం నింపారు.

ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News