Rajender Prasad About Sr NTR Second Marriage: తెలుగు సినీ పరిశ్రమకు, రాజకీయాలకు ఎన్నో ఏళ్ల సంబంధం ఉన్నది. ఇప్పటికి కూడా చాలామంది సెలబ్రిటీలు, పొలిటికల్ వైపుగా కూడా అడుగులు వేస్తూ ఉండగా.. మరి కొంతమంది పొలిటికల్ పార్టీలకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అలా సీనియర్ నటుడుగా పేరుపొందిన రాజేంద్రప్రసాద్ కూడా రాజకీయాలతో మంచి సంబంధమే కలిగి ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో రాజకీయాల గురించి ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఎన్టీఆర్ హయాంలో ఆయనకు మద్దతుగా ప్రచారం చేశారు రాజేంద్రప్రసాద్.
ఆ తర్వాత రాజకీయాల విషయాలలో ఎక్కడా చర్చించలేదు. అయితే పర్సనల్ గా మాత్రం చంద్రబాబు నాయుడుకి, టిడిపి పార్టీకి మద్దతుగానే నిలిచేవారట.
తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాల గురించి మాట్లాడుతున్న రాజేంద్రప్రసాద్ సీనియర్ ఎన్టీఆర్ పైన తన అభిప్రాయాన్ని తెలిపారు. అయితే లక్ష్మీపార్వతి పైన తీవ్రమైన విమర్శలు కూడా చేశారట. ఆమె పేరును ప్రస్తావించకుండానే ఆమెను ఒక దరిద్రమంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది రాజేంద్రప్రసాద్.
ఆ దరిద్రం వల్లే సీనియర్ ఎన్టీఆర్ తమకి దూరమయ్యారని, ఆమె ప్లాన్ ప్రకారమే వచ్చి ఎన్టీఆర్ జీవితాన్ని నాశనం చేసిందంటూ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు.చంద్రబాబును విమర్శించేందుకు ప్రత్యర్థుల పార్టీలతో చేతులు కలిపిందని, అదే వారికి అస్త్రంగా మారింది అంటూ తెలిపారు. సీనియర్ ఎన్టీఆర్ చనిపోయినప్పుడు, ఆయన పిల్లల కంటే తానే ఎక్కువగా ఏడ్చానని తెలిపారు.
అలా ఎందుకు ఏడ్చాననే విషయంపై ఇప్పుడు నోరు విప్పుతున్నానని, తన దృష్టిలో సీనియర్ ఎన్టీఆర్ ఒక దేవుడు అని, దేవుడు అంటే ఎలా ఉంటాడో ఆయననే చూశానని, దేవుడుగా ఉన్న వ్యక్తికి కూడా ఒకానొక దశలో దరిద్రం పట్టింది. ఆయన జీవితంలోకి ఆ దరిద్రం వచ్చిన తర్వాతే ఆయన జీవితం నాశనం అయ్యిందని తెలిపారు. సీనియర్ ఎన్టీఆర్ దగ్గర ఆవిడ చేసే ఓవరాక్షన్ భరించలేకపోయామని, చివరికి చంద్రబాబు నాయుడు వల్లే ఆ సమస్య నుంచి బయటపడ్డారని తెలిపారు. ఆమె గురించి తాను మర్యాద లేకుండా.. మాట్లాడుతున్నానని అందరూ అనుకోవచ్చు. నిజానికి ఆవిడకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదని వెల్లడించారు. మొత్తానికి రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
Read more: Sai Pallavi: నా జీవితంలో ఇలాంటి పీలింగ్స్ లేవు..!.. చెల్లి పెళ్లిపై ఎమోషనల్ అయిన సాయి పల్లవి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter