Tesla EV Car: ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన తరువాత ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్ టెస్లా ఇండియాలో ఎంట్రీ ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. దేశంలో రెండు ప్రధాన నగరాల్లో షోరూమ్స్ ప్రారంభించనుంది. అసలు టెస్లా ఈవీ కారు ఎలా ఉంటుంది, ధర ఎంత ఉండవచ్చు. షోరూమ్స్ ఏయే నగరాల్లో ప్రారంభం కానున్నాయో తెలుసుకుందాం.
ఇండియాలో టెస్లా ఈవీ కార్ల ఎంట్రీపై క్లారిటీ వచ్చేసింది. దేశంలో రెండు నగరాల్లో టెస్లా షోరూమ్స్ ప్రారంభించనుంది. దీనికోసం ఢిల్లీలోని ఏరోసిటీ, ముంబైలోని బీకేసీ బిజినెస్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలను ఎంపిక చేసినట్టు సమాచారం. ఢిల్లీ ఏరోసిటీ ప్రాంతం ఎయిర్‌పోర్ట్, హోటల్లు, రిటైల్ అవుట్‌లెట్స్ , గ్లోబల్ కంపెనీలకు దగ్గరగా ఉండటంతో ఈ ప్రాంతాన్ని కంపెనీ ఎంపిక చేసింది. ఇక ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రాంతం కూడా ఎయిర్‌పోర్ట్‌కు చేరువలో ఉంది. రెండు షోరూమ్స్ 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి. ప్రారంభంలో జర్మనీ నుంచి ఇండియాకు కార్ల దిగుమతి చేసుకుని అమ్మకాలు సాగించనున్నారు. జర్మనీలోని బెర్లిన్ ప్లాంట్ నుంచి వీటిని దిగుమతి చేసుకుంటారు. ఇప్పటికే టెస్లా ఇండియాలో 13 ఉద్యోగాల భర్తీకు ప్రకటన విడుదల చేసింది. ప్రారంభదశలో టెస్లా ఇండియాలో26 వేల నుంచి 43 వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇండియాలో దిగుమతులపై ఉన్న భారీ సుంకాలతో ధర మరింత పెరిగి కొనుగోళ్లపై ప్రభావం చూపిస్తుందనే కారణంతో టెస్లా ఇండియా ఎంట్రీ ఆలస్యం చేసింది. ఇటీవల మోదీ పర్యటన దిగుమతి సుంకాలపై రాయితీ నిర్ణయంతో టెస్లా ఎంట్రీకు మార్గం క్లియర్ అయింది.
ఈ ఏడాది ఏప్రిల్ నుంచే ఇండియాలో టెస్లా కార్ల అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇండియాలో టెస్లా ఈవీ కారు ప్రారంభ ర 21 లక్షలు ఉండవచ్చని అంచనా.
Also read: Champions Trophy 2025: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ జట్టు బలాబలాలు, హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి