Jio New Recharge plan: రిలయన్స్ జియో 448 రూపాయల ప్లాన్‌ను మరింత చౌకగా మార్చింది. ఈ ప్లాన్ టారిఫ్ 3 రూపాయలు తగ్గించడమే కాకుండా 13 ఓటీటీ సబ్స్క్రిప్షన్లు ఉచితంగా అందిస్తోంది. ఈ ప్లాన్ గురించి పూర్తి ప్రయోజనాలు తెలుసుకుందాం.
రిలయన్స్ జియో 448 రూపాయల ప్రీమియం ప్లాన్‌ను 445 రూపాయలు చేసింది. ప్రయోజనాలు మాత్రం యథావిధిగా ఉంటాయి. ఎలాంటి మార్పు ఉండదు. యూజర్లను నిలిపి ఉంచేందుకు, కొత్త యూజర్లను ఆకట్టుకునేందుకు జియో కొత్త ప్లాన్స్ ప్రకటిస్తూ ఉంటోంది. జియో 448 రూపాయల ప్లాన్‌ను 445 రూపాయలకు తగ్గించింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది. ప్రయోజనాలు మాత్రం యథావిధిగా ఉంటాయి. ఈ ప్లాన్‌తో పాటు అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉంటాయి. అది కాకుండా రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది.
ఈ ప్రయోజనాలతో పాటు ఓటీటీ సేవలు కూడా ఉచితంగా పొందే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా 13 ఓటీటీల సబ్స్క్రిప్షన్ ఉచితంగా పొందవచ్చు. అందులో సోనీలివ్, జీ5, జియో సినిమా ప్రీమియం, లయన్స్ గేట్‌ప్లే, డిస్కవరీ ప్లస్, సన్నెక్స్ట్, కాంచా లాంగా, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, హోయ్‌చోయ్, జియో టీవీ, జియో క్లౌడ్, ఫ్యాన్ కోడ్ ఓటీటీ సేవలు లభిస్తాయి.
Also read: Caste Census: తెలంగాణలో తేలిన కులాల లెక్కలు, ఏ కులం జనాభా ఎంతో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి