Junior Secretariat Assistant Jobs Recent Notification 2025: నిరుద్యోగ యువత కోసం అద్భుతమైన గుడ్ న్యూస్.. వీలైనంత త్వరలోనే CSIR IICT సంబంధించిన జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ జరగబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలైంది. హైదరాబాద్ కి సంబంధించిన ఇండియన్ ఇన్‌డియన్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, నుంచి ఈ నోటిఫికేషన్ విడుదల అయింది. అయితే ఇందులో (CSIR-IICT) లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగుల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ నోటిఫికేషన్ లో భాగంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు కొన్ని రకాల అర్హతలు కలిగి ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ జాబ్స్ అప్లై చేసుకునే వారు తప్పకుండా 25 సంవత్సరాల పైగా వయస్సు ఉండాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో వెల్లడించారు. అలాగే ఈ నోటిఫికేషన్ లో భాగంగా విద్యార్హతలను కూడా క్లుప్తంగా పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలను అప్లై చేసుకునే వారు తప్పకుండా 12వ తరగతి పాస్ అవ్వాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే ఈ పోస్టుల మొత్తం సంఖ్య 15 కాగా వీటన్నిటిని భర్తీ చేయబోతున్నట్లు నోటిఫికేషన్ లో వెల్లడించారు.
ఇక ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారు ఆఫ్లైన్లో విధానంలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అధికారిక వెబ్సైట్ అయిన (https://iict.res.in/adminrectt/) ఆఫ్‌లైన్‌లో డాక్యుమెంట్స్ ప్రింట్ తీసుకొని అన్ని ఫిల్ చేసి మార్చి మూడో తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య మొత్తం 15 కాగా ఇందులో రాత పరీక్ష ఆధారంగా తీసుకొని ఎంపిక చేయబోతున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపారు.
Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత
రాత పరీక్షలో పాసైన వారికి టైపింగ్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేయబోతున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో చూడొచ్చు. ఇక జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగులకు సంబంధించిన జీతాలను కూడా నోటిఫికేషన్లు తెలిపారు. ఈ జాబ్స్ కి ఎంపికైన వారికి ప్రతి నెల రూ.38,483 జీతం అందించబోతున్నారు. నిరుద్యోగ యువతకు ఇది అద్భుతమైన ఛాన్స్ గా భావించవచ్చు. మార్చి మూడో తేదీలోగా అప్లై చేసుకుని రాత పరీక్షకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది.
Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి