Gukesh 2024 Earnings: భారత గ్రాండ్ మాస్టర్ గూకేష్ దొమ్మరాజు 2024వ సంవత్సరాన్ని అద్భుత విజయాలతో ముగించాడు. ఈ ఏడాది అతను దేశం గర్వించదగ్గ విజయాలను సాధించాడు. దీంతో గూకేష్ కు కేంద్ర ప్రభుత్వం భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్న ప్రకటించింది. ఈ క్రమంలోనే గూకేష్ మరో అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షున్ని బీట్ చేశాడు. అయితే అది తాను ప్రావీణ్యం పొందిన చెస్ గేమ్ లో కాదండోయ్.. సంపాదనలో. అమెరికా ప్రెసిడెంట్ వార్షిక జీతం కంటే ఈ ఏడాది గూకేష్ అర్జించిన జీతమే ఎక్కువ.
2024లో గూకేష్ సంపాదన మొత్తం 1,577,842 డాలర్లు. అది భారతదేశ కరెన్సీలో సుమారు 13.6 కోట్లు. ప్రపంచ ఛాంపియన్ గూకేష్ మ్యాచ్ శాలరీలు విన్నింగ్ ప్రైస్ ల తో పాటు ప్రైజ్ మనీలను కలుపుకొని 2024లో ఈ భారీ మొత్తం అందుకున్నాడు. అయితే ప్రస్తుతం అమెరికా ప్రెసిడెంట్ వార్షిక జీతం 400,000 డాలర్లుగా ఉంది. అంటే ఈ ఏడాది గూకేష్ సంపాదన అమెరికా ప్రెసిడెంట్ జీతం కంటే దాదాపు నాలుగు రేట్లు ఎక్కువ అని చెప్పవచ్చు. అలా ఈ విజయాలు గూకేష్ కు పేరు ప్రఖ్యాతలతో పాటు డబ్బును కూడా తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలో సంపాదనలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు మించిపోయాడు గూకేష్.
Also Read: Business Ideas: ఎకరం పొలంలో ఈ పంట సాగు చేస్తే.. తక్కువ సమయంలో 3 లక్షలు మీ సొంతం
కాగా ప్రపంచ ఛాంపియన్ షిప్ గెలిచిన తర్వాత గూకేష్ కు తమిళనాడు ప్రభుత్వం రూ.5కోట్లు నగదుగా ఇచ్చింది. అలాగే క్యాండిడేట్స్ టోర్నమెంట్లో గెలిచిన అతనికి చదువుతున్న వేలమ్మాళ్ విద్యాలయం మెరిసిడెస్ కారు అందజేసింది. అయితే ఈ రెండు ప్రైజ్ మనీలు ఇందులో భాగం కావట. ఇవి కాకుండానే గూకేష్ సంపాదన 13 కోట్ల కంటే ఎక్కువ ఉండడం విశేషం.
ఇక 2024లో చెస్ ప్లేయర్ సంపాదనలో గూకేష్ అగ్రస్థానంలో నిలిచాడు.గూకేశ్ తర్వాత వరుసగా డింగ్ లిరెన్ 1,183,600 డాలర్లు, మాగ్నస్ కార్ల్‌సెన్ 633,369 డాలర్లతో ఉన్నారు. గూకేష్ తర్వాత ఇద్దరు మాత్రమే ఏడాదిలో ఒక మిలియన్ డాలర్ ప్రైజ్ మనీని సంపాదించారు. మొత్తంగా 17 మంది ఆటగాళ్లు 100,000 కంటే ఎక్కువ వీరు సంపాదించారు. ఇందులో ఇద్దరు మహిళలు ఉండగా భారత్ కు చెందిన కోనేరు హంపి ఉన్నారు. ఈ జాబితాలో ఆర్ ప్రజ్ఞానందా 202,136 డాలర్లు (9వ స్థానం), అర్జున్ ఎరిగైసి 119,767 డాలర్లు (15వ స్థానం)లో నిలిచారు.
Also Read:Amrit Bharat 2.0: రెండేళ్లలో 50 అమృత్ భారత్ రైళ్ల తయారీ ..కొత్త 12 రకాల మార్పులు: అశ్వనీ వైష్ణవ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.