Income Tax Rules: ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన కేంద్ర బడ్జెట్ ట్యాక్స్ పేయర్లకు ఓ వరంగా మారింది. చాలాకాలంగా ఎదురుచూసిన వేతన జీవుల అంచనాలను దాటి ట్యాక్స్ మినహాయింపు లభించింది.12 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి ట్యాక్స్ లేకపోవడంతో ట్యాక్స్ పేయర్లకు భారీ ఉపశమనం లభించింది. కానీ ఆర్ధిక నిపుణుల సూచనలు వెంటే మీకు దిమ్మ తిరగడం ఖాయం.
కేంద్ర బడ్జెట్‌లో 12 లక్షల వరకు వార్షిక ఆదాయంపై జీరో ట్యాక్స్ మినహాయింపు లభించింది. 12 లక్షలు ఆదాయం దాటితే మాత్రం పన్ను చెల్లీంచాల్సి ఉంటుంది. ఒకవేళ మీ జీతం 12 లక్షలు దాటి ఉంటే ట్యాక్స్ మినహాయింపుకు అవకాశం ఉంటుందా అంటే కొన్ని సూచనలు పాటిస్తే కచ్చితంగా ఉంటుందంటున్నారు. కొత్త ట్యాక్స్ విధానంలో ఈ ట్రిక్స్ పాటిస్తే మీ వార్షిక ఆదాయం 18 లక్షలు ఉన్నా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదంటున్నారు. ఆశ్చర్యంగా ఉందా..కానీ ఇది నిజమే. ఆ ట్రిక్స్ ఏంటో, ఏం చేయాలో వివరాలు మీ కోసం. ఈ ట్రిక్ ద్వారా మీ ఆదాయం 18 లక్షల వరకు ఉన్నా సరే ట్యాక్స్ నుంచి రిలీఫ్ పొందవచ్చు.
ట్యాక్స్ ఎలా సేవ్ చేయొచ్చు
మీ కనీస వేతనం , డీఏ 12.75 లక్షలుంటే ఆ ఆదాయంపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. వివిధ రకాల అలవెన్సులు, ప్రయోజనాల ద్వారా ఇది వర్తిస్తుంది. ఉదాహరణకు ఎన్‌పీఎస్ కంట్రిబ్యూషన్ 1.71 లక్షలు, 4 లక్షలు కారు సౌకర్యం, 5 వేల రూపాయలు గిఫ్ట్ కింద పరిగణించవచ్చు. ఇవి కలుపుకుంటే మీ గ్రాస్ జీతం 18 లక్షలు అవుతుంది. ఎన్‌పీఎస్ కంట్రిబ్యూషన్ బేసిక్ జీతం, డీఏపై 14 శాతం వరకు ఉండవచ్చు. ఇదంతా సెక్షన్ 80 సిసిడి ప్రకారం 1.71 లక్షల వరకూ ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు.
ఇక ఇన్‌కంటాక్స్ సెక్షన్ 17 (2) రూల్ నెంబర్ 3 ప్రకారం కంపెనీ నుంచి వచ్చే 5 వేల రూపాయల గిఫ్ట్‌పై ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. ఇక స్టాండర్డ్ డిడక్షన్ ప్రకారం 75 వేల వరకు మినహాయింపు పొందవచ్చు. ఇలా మొత్తం వార్షిక ఆదాయం 18 లక్షల వరకు ఉంటే ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.
కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన కొత్త ఇన్‌కంటాక్స్ బిల్లు ఇంకా పార్లమెంట్లో ప్రవేశపెట్టలేదు. వచ్చేవారం ఈ బిల్లు వస్తుందని అంచనా ఉంది. ఇన్‌కంటాక్స్ చట్టంలో వచ్చిన మార్పులు, స్లాబ్ వివరాలు ఈ బిల్లులో మరింత స్పష్టంగా ఉండనున్నాయి.
Also read: Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్, 31 మంది మావోయిస్టులు హతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి