Icsil Job Recruitment 2025: ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (ICSIL) కంపెనీ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా వివిధ కాళీ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్‌ను ఫిల్ చేయబోతున్నట్లు ఈ నోటిఫికేషన్ లో వెల్లడించారు. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ విడుదల చేసిన 55 పోస్టులను అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో భాగంగా తెలిపారు. ఫిబ్రవరి 22వ తేదీ లోపు www.icsil.in అందుబాటులో ఉంచిన అప్లికేషన్ ఫార్మా ద్వారా అన్ని వివరాలు ఫిల్ చేసి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది. అలాగే దీనిని అప్లై చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా పరీక్షించి టైపింగ్ టెస్ట్ తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపారు..
అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ లో వివిధ రకాల అర్హతలతో పాటు జీతాలకు సంబంధించిన వివరాలను కూడా క్లుప్తంగా పేర్కొన్నారు. ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ దరఖాస్తు కోరిన ఉద్యోగాలకు ఎంపికైన వారు ప్రతినెల రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు జీతం పొందుతారు. ఇక ఈ ఉద్యోగాలను దరఖాస్తు చేసుకునేవారు కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత
నేరుగా ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఫీజులో భాగంగా ఓబీసీ అభ్యర్థులు రూ.590 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా 18 సంవత్సరాలు పైబడిన వారే ఈ ఉద్యోగాలకు అర్హులు. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హత వివరాలు లోకి వెళితే.. ఏదైనా ఒక డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎంపిక చేసే విధానంలో భాగంగా తప్పకుండా స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందని నోటిఫికేషన్లో వెల్లడించారు.
Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి