Bourbon Whisky Price Cut: మద్యం ప్రేమికులు ఎగిరి గంతేసే వార్త. అమెరికా ప్రసిద్ధ విస్కీ ధర ఇండియాలో భారీగా తగ్గిపోనుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో భారత ప్రధాని మోదీ చర్చల నేపధ్యంలో భారత ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఫలితం ఇది. పాపులర్ ఇంపోర్టెడ్ విస్కీ ధర తగ్గుతోంది.
విస్కీ ప్రేమికులకు తెలిసిన ఇంపోర్టెడ్ బ్రాండ్ బోర్బన్ విస్కీ. అమెరికాలో తయారయ్యే పాపులర్ బ్రాండ్ ఇది. ఇప్పటి వరకు ఈ విస్కీపై దిగుమతి సుంకం ఏకంగా 150 శాతం ఉండేది. అమెరికా నుంచి ఈ విస్కీ ఇండియాలో దిగుమతి అవుతోంది. దిగుమతి సుంకం ఎక్కువగా ఉండటంతో ధర భారీగా ఉంటోంది. ఇండియాలో ఈ విస్కీ పెద్దఎత్తున దిగుమతి అవుతుంటుంది. 2023-24 సంవత్సరంలో ఇండియాకు 2.5 మిలియన్ డాలర్ల విలువైన బోర్బన్ విస్కీ దిగుమతి అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. బోర్బన్ విస్కీ ఫుల్ బాటిల్ ధ 3 వేల నుంచి ప్రారంభమౌతుంది. వివిధ రాష్ట్రాల్లో ఉండే పన్నులను బట్టి ధర మారుతుంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ఫుల్ బాటిల్ ధర 3500 రూపాయలు కూడా ఉండవచ్చు. ఇప్పుడు దిగుమతి సుంకాన్ని ఇండియా ఏకంగా 100 శాతం తగ్గించి కేవలం 50 శాతానికి పరిమితం చేస్తోంది. దాంతో బోర్బన్ విస్కీ ధర భారీగా తగ్గనుంది. దిగుమతి సుంకం తగ్గింపు అమల్లోకి రాగానే బోర్బన్ విస్కీ ఫుల్ బాటిల్ ధర 1800-2000 వరకూ పడిపోవచ్చు.
బోర్బన్ విస్కీ ఎందుకు ప్రత్యేకం
బోర్బన్ విస్కీ మొక్కజొన్న నుంచి తయారవుతుంది. కొద్దిగా తీపిగా ఉంటుంది. ఇందులో 51 శాతం మొక్కజొన్న ఉండటంతో ప్రత్యేకమైన రుచి ఉంటుంది. 1964లో యూఎస్ కాంగ్రెస్ ఈ విస్కీని విలక్షణమైన ఉత్పత్తిగా గుర్తించడంతో ప్రాచుర్యం పొందింది. బోర్బన్ విస్కీతో పాటు మరి కొన్ని ఉత్పత్తులపై కూడా దిగుమతి సుంకం తగ్గించే అవకాశాలున్నాయి. 2030 నాటికి ఇండియా అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 500 బిలియన్ డాలర్లకు పెంచేందుకు ఒప్పందం జరిగింది.
Also read: Broadband Plan: 100 ఎంబీపీఎస్ స్పీడ్, ఓటీటీ, టీవీ ఛానెళ్లు ఉచితం, ప్లాన్స్ వివరాలు ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి