Bank Loan Borrowers: బ్యాంకు రుణం తీసుకునేవారికి గుడ్‌న్యూస్‌.. లోన్ల మంజూరు సులభతరం!

RBI New Rule Of Credit Score Update: బ్యాంకు రుణం పొందాలనుకునే వారికి భారతీయ రిజర్వ్‌ బ్యాంకు భారీ శుభవార్త వినిపించింది. బ్యాంకు రుణం జారీ విధానంలో కీలకమైన మార్పు చేసింది. ఈ నిబంధనతో ఎలా రుణం పొందవచ్చో తెలుసుకోండి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 10, 2025, 05:57 PM IST
Bank Loan Borrowers: బ్యాంకు రుణం తీసుకునేవారికి గుడ్‌న్యూస్‌.. లోన్ల మంజూరు సులభతరం!

Credit Score Update: ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు ఉన్న ప్రధాన మార్గం బ్యాంకు రుణం. ఆర్థికంగా తోడ్పాటు అందించే బ్యాంకుల నుంచి రుణం పొందాలంటే సవాలక్ష నిబంధనలు ఉంటాయి. రుణం మంజూరు కావాలంటే చాలా కష్టాలు పడాల్సి ఉంది. ఈ కష్టాల నుంచి ఊరట చెందేలా భారతీయ రిజర్వ్‌ బ్యాంకు కీలక నిబంధనను మార్చి వేసింది. కొత్త నిబంధన తీసుకురావడంతో బ్యాంకు రుణాలు సరళతరంగా లభించే అవకాశం ఉంది.

Also Read: Radish Juice: ముల్లంగిని ఇలా తీసుకుంటే 'కొవ్వు' కొండలా కరిగించేస్తుంది

బ్యాంక్​ లోన్ తీసుకోవాలనుకునే ఆర్‌బీఐ శుభవార్త వినిపించింది. బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు తాము సేకరించే క్రెడిట్ రిపోర్టును 15 రోజులకు ఒకసారి కచ్చితంగా అప్డేట్ చేయాలని ఆర్​బీఐ ఆదేశించింది. గతంలో 30 రోజులకు ఒకసారి బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు క్రెడిట్ నివేదికను అప్‌డేట్‌ చేసే విధానం ఉండేది. తాజాగా భారతీయ రిజర్వ్‌ బ్యాంకు ఆ గడువును 15 రోజులకు తగ్గిస్తూ ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ద్రవ్య పరపతి విధాన సమీక్ష తర్వాత ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Also Read: Russell Viper Snake: కలెక్టరేట్‌లోకి దూరిన అత్యంత విషపూరిత పాము.. లేపాక్షి ఆలయంలో హల్‌చల్‌

క్రెడిట్ స్కోర్‌ రిపోర్టు అప్‌డేట్‌ గడువు తగ్గింపుతో సులభంగా బ్యాంకు మంజూరు అవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రుణ గ్రహీతల క్రెడిట్ యోగ్యతను అంచనా వేయడానికి బ్యాంకులు క్రెడిట్ రిపోర్టును పరిగణనలోకి తీసుకుంటాయి. సిబిల్ స్కోరును పరిశీలిస్తాయి. తాజాగా క్రెడిట్‌ అప్‌డేట్‌ గడువు తగ్గింపుతో ఉదాహరణకు 750 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు సులభంగా రుణాలు మంజూరు చేస్తాయి. దీంతోపాటు తక్కువ వడ్డీ రేటుకే వారికి రుణాలు ఇస్తాయి. మంచి సిబిల్ స్కోర్ ఉన్నవారికి లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు వెనకాడవు కూడా.

సిబిల్ స్కోరు 550 ఉన్నవారికి బ్యాంకులు లోన్లు ఇచ్చేందుకు నిరాకరిస్తుంటాయి. వారికి లోన్లు ఇవ్వడం ప్రమాదకరమని భావనలో ఉంటాయి. అలాంటి వారికి ఆర్‌బీఐ కొత్తగా తగ్గించిన క్రెడిట్‌ అప్‌డేట్‌ గడువుతో సులభంగా రుణాలు మంజూరయ్యే అవకాశం ఉంది. ఆర్‌బీఐ రెపో రేటును కూడా తగ్గించిన విషయం తెలిసిందే. కేంద్ర బడ్జెట్‌లో.. ఆర్‌బీ విధాన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు ఆర్థికంగా మేలు చేసేవిగా ఉన్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News