Becil New Recruitment 2025: ఎప్పటి నుంచో మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? ఇది అద్భుతమైన ఛాన్స్‌గా భావించవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు చేయాలనుకునేవారికి ఇది పెద్ద గుడ్ న్యూస్.. ప్రముఖ బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగ యువత కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఖాళీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు వెల్లడించింది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయబోతున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించారు.
అంతేకాకుండా ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అప్లై చేసుకునే అభ్యర్థులకు ఉండాల్సి అర్హతలను కూడా వెల్లడించారు. ఈ అప్లికేషన్ ఫిబ్రవరి 12వ తేదీలోపు చేరవిధంగా ఉండాలని నోటిఫికేష్‌లో క్లుప్తంగా తెలిపారు. ఇక ఈ జాబ్స్‌కి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) ఈ ఉద్యోగాల భర్తీకి పూర్తి బాధ్యతను చేపట్ట బోతున్నట్లు తెలుస్తంది. అంతేకాకుండా ఆసుపత్రుల్లో ఉండే వివిధ రకాల జాబ్స్‌కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ సంస్థ విడుదల చేసిన నోటిఫికేషన్ వివరాల్లోకి వెళితే.. నోటిఫికేషన్‌లో ల్యాబ్ అటెండెంట్‌తో పాటు డెంటల్ టెక్నీషియన్, ఫుడ్ బేరర్, టెక్నాలజిస్ట్, PCC, PCM వంటి పోస్టులు ఖాళీ ఉన్నాయి. వీటికి సంబంధించిన ఖాళీలను భర్తీ చేసేందుకే ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన్నట్లు తెలుస్తోంది. ఇక మొత్తం పోస్టుల సంఖ్య 54 కాగా..వీటన్నింటినీ ఈ నోటిఫికేషన్‌లోనే భర్తీ చేయనున్నారు. ఇక అభర్థులకు సంబంధించిన అర్హతల వివరాల్లోకి వెళితే.. ఈ జాబ్స్‌ను అప్లై చేసుకునేవారు తప్పకుండా 10th, 12th, డిగ్రీ వంటి విద్యార్హతలు ఉండాలని నోటిఫికేషన్‌లో వెల్లడించారు.
Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత
అలాగే ఈ నోటిఫికేషన్‌లో ఉద్యోగాలకు సంబంధించిన జీతాలను కూడా ప్రకటించారు. MRT పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.20,903పైగా జీతం చెల్లించబోతున్నట్లు నోటిఫికేషన్‌లో తెలిపారు. అలాగే ఫుడ్ బేరర్స్‌కు జీతం రూ.18,933, PCM పోస్టులకు రూ.30,000, MLT పోస్టులకు రూ. 40,710 జీతం అందించబోతున్నట్లు తెలిపారు. ఇవే కాకుండా అన్ని పోస్టులకు సంబంధించిన జీతాల పూర్తి వివరాలను కూడా వెల్లడించినట్లు సమాచారం.. ఇక ఇందులో వయస్సు పరిమితిని కూడా వెల్లడించారు. ఈ అర్హతల వివరాల్లోకి వెళితే.. 20 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలని పేర్కొన్నారు. అలాగే ఈ జాబ్‌కు (Becil Recruitment 2025 Apply Online) అప్లై చేసుకునేవారు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి