Tirumala News: తిరుమల శ్రీవారిని కోట్లాది భక్తులు ఎంతో ఆర్తితో కొలుస్తారు. ఆ క్షేత్రాన్ని స్వామి వారు నడయాడిన కలియుగ వైకుంఠంగా విలసిల్లుతోంది. ఈ క్షేత్రాన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది భక్తులు నిరంతరం స్వామివారిని దర్శించుకుంటారు. కానీ ఇక్కడ కొంతమంది చేసే పనుల కారణంగా తిరుమల వార్తల్లో నిలుస్తోంది. రీసెంట్ గా తిరుమల లడ్డూ వ్యవహారంతో తిరుమల క్షేత్రం మరోసారి వివాదాస్పాదమయింది. మరోవైపు అక్కడ అన్యమతస్తులున్నా.. అక్కడి అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనే టాక్ ఉంది.
లడ్డూ వ్యవహారం తర్వాత వైకుంఠ ఏకాదశి సందర్బంగా తొక్కిసలాట.. అలాగే మాంసాహారం, మద్యం సేవించడం వంటివి ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంపై మరోసారి విమానాలు చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. ఒక విమానం ఆలయ గోపురంపై నుంచి వెళ్లడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంపై నుంచి విమానాల రాకపోకలు నిషిద్ధం. ఆలయంపై రాకపోకలు సాగిస్తే ఆపదలు సంభవిస్తాయని ఆగమ పండితులు చెబుతున్నారు. మరోవైపు, శ్రీవారి ఆలయంపై విమానాల రాకపోకలపై కేంద్ర ప్రభుత్వానికి టీటీడీ పలుమార్లు ఫిర్యాదు చేసింది. తిరుమల ఆలయంపై విమాన రాకపోకలను నిషేధించాలని కోరింది. ఆ ప్రాంతాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని కోరింది. అయినా కేంద్ర విమానయాన శాఖ పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ప్రస్తుతం కేంద్రంలో తెలుగు దేశం పార్టీకి చెందిన కింజారపు రామ్మోహన్ నాయుడు మంత్రిగా ఉన్నారు. దీంతో ఈ వ్యవహారంపై ఆయన శ్రద్ద పెడితే బాగుంటుందనే టాక్ వినిపిస్తోంది.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.