AP Politics: కాకినాడ జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గంలో హాట్‌హాట్ పాలిటిక్స్‌కు కేరాఫ్ అడ్రస్. ఈ నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో రాష్ట్రంలో ఎవరికి అంతు చిక్కదు. ఈ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ పాగా వేసింది. అయితే 2024 ఎన్నికలు వచ్చే సరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ఫ్యాన్ పార్టీకి గుడ్‌బై చెప్పిన ఓటర్లు.. కూటమి పార్టీ అభ్యర్థికి జై కొట్టారు. అయితే గతంలో జగ్గంపేటలో వైసీపీ ఎమ్మెల్యేగా చక్రం తిప్పిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో మరోసారి చక్రం తిప్పుతున్నారని ప్రచారం సాగుతోంది. అంతేకాదు తన కొడుకు జ్యోతుల నవీన్ పత్తిపాడు నియోజకవర్గంపై కన్నేశారని ప్రచారం జరుగుతోంది.
ఇక 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో.. ఆయన చంద్రబాబు పక్కన చేరిపోయారు. ఐదేళ్లు అధికార పార్టీలో కొనసాగుతూ చక్రం తిప్పారు. అయితే 2019 ఎన్నికలు వచ్చేసరికి జగ్గంపేటలో పరిస్థితులు పూర్తిగా మారిపోయారు. అప్పటివరకు వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగిన జ్యోతుల నెహ్రుకు ప్రజలు దిమ్మతిరిగే షాక్ అచ్చారు. ఆ ఎన్నికలలో వైసీపీ నుంచి బరిలో నిలిచిన జ్యోతుల చంటిబాబు ప్రజలు పట్టం కట్టారు. అయితే 2024లో జగ్గంపేటలో జ్యోతుల చంటిబాబుకు టికెట్ ఇచ్చేందుకు జగన్ నిరాకరించారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే జగ్గంపేట ఇంచార్జ్‌గా మాజీమంత్రి తోట నరసింహంను ఇంచార్జ్‌గా నియమించారు. మొన్న జరిగిన ఎన్నికల్లో తోట నరసింహం బరిలో నిలవగా.. అక్కడ కూటమి అభ్యర్ధి జ్యోతుల నెహ్రు మరోసారి విజయం సాధించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. జగ్గంపేటలో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందట. ఇన్నాళ్లు ఇంచార్జ్‌గా కొనసాగిన తోట నరసింహం అనారోగ్య కారణంగా బయట తిరగడం లేదట. చుట్టపుచూపుగా కార్యక్రమంలో పాల్గొంటున్నారని క్యాడర్ ఆరోపిస్తున్నారు. ఇక తనకు పార్టీ టికెట్ ఇవ్వకపోయినా జనసేనలోకి వెళ్లే ప్రయత్నం చేసి విఫలమైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే చంటిబాబు ఆంటీ అంటున్నట్లుగానే ఉంటున్నారట. ఆయన పార్టీలో ఉన్నారా లేదా తమకే తెలియడం లేదని కేడర్ ఆరోపిస్తున్నారట. ఇద్దరు సీనియర్ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో కేడర్ పరేషాన్ అవుతున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. జగ్గంపేటలో బీజేపీ పరిస్థితి కూడా వైసీపీ లాగే తయారైందనే టాక్ వినిపిస్తోంది. ఇక్కడ కాషాయపార్టీకి ఇంచార్జ్ ఎవరో కూడా కూటమి నాయకులకే తెలియడం లేదట. కేంద్రంలో వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీకి పట్టుమని పదిమంది నాయకులు కూడా నియోజకవర్గంలో లేరని ప్రచారం సాగుతోంది. ఇదే విషయాన్ని సొంత పార్టీ నేతలే అంగీకరిస్తున్నారట. ఇక జనసేన నుంచి తుమ్మలపల్లి రమేష్ ఇంచార్జ్‌గా కొనసాగుతున్నా ఆయన సింగల్ మెన్ ఆర్మీ గానే కార్యక్రమాలకు హాజరవుతున్నారని టాక్ వినిపిస్తోంది. మొత్తంగా జగ్గంపేటలో ప్రతిపక్ష వైసీపీకి డీలా పడటం.. జనసేన, బీజేపీలకు నేతలు లేకపోవడంతో.. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఆయన కుమారుడు టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ చక్రం తిప్పుతున్నారట. అంతేకాదు జగ్గంపేటతోపాటు పత్తిపాడులో కూడా నవీన్ పాలిటిక్స్ లోనూ వేలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు గుసగుస లాడుకుంటున్నారు.
మొత్తంగా జ్యోతుల నవీన్ తీరుపై అటు పత్తిపాడు ఎమ్మెల్యే కూడా పరేషాన్ అవుతున్నట్టు తెలిసింది. తన నియోజకవర్గంలోకి సొంత పార్టీకి చెందిన నేతే రాజకీయం చేస్తుండటంపై ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ గుర్రుగా ఉన్నారట. ఏదీఏమైనా జ్యోతుల నెహ్రూ, ఆయన కుమారుడు నవీన్‌ను కంట్రోల్ చేయాలని సొంత పార్టీ లీడర్లే పార్టీ హైకమాండ్‌ను కోరుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Also Read: EPFO Updates: పీఎఫ్ ఖాతాదారులకు డబుల్ జాక్‌పాట్.. ఒకేసారి రెండు శుభవార్తలు..!
Also Read: Sai Pallavi: అబ్బాయిలు అలా ఉంటేనే ఇష్టం.. మనసులోని మాట బైటపెట్టిన సాయి పల్లవి.. మ్యాటర్ ఏంటంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter