AP Government: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పెన్షనర్లపై వేటు వేస్తోంది. వివిధ రకాల సర్వేలతో అనర్హుల జాబితా సిద్ధం చేస్తోది. ఇప్పుడు మరోసారి భారీగా కోత పెట్టింది. ఫిబ్రవరి పెన్షన్లలో ఏకంగా 18 వేలమందిని తొలగించింది.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అనర్హుల పేరుతో పెన్షన్లపై సర్వే చేపట్టింది. ప్రతి నెలా పెన్షన్లకు కోతపెడుతూ వస్తోంది. ఇప్పుడు మరోసారి ఫిబ్రవరి నెల పెన్షన్లపై దృష్టి సారించింది. ఏకంగా 18 వేల పెన్షన్లను తొలగించింది. వీళ్లలో అత్యధికం దివ్యాంగ పెన్షనర్లే కావడం విశేషం. దివ్యాంగులకు జారీ చేసే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేసిన ప్రభుత్వం నకిలీ పెన్షన్లను గుర్తించింది. ఇలా మొత్తం 18 వేల పెన్షన్లు ఉన్నాయి.
ఏపీలో జనవరి నెల పెన్షనర్ల జాబితాలో 63,77,944 మంది ఉంటే ఫిబ్రవరిలో ఈ సంఖ్య 63,59,907కు తగ్గింది. అంటే 18 వేల 036 మందిని ప్రభుత్వం తొలగించింది. మొత్తం అన్ని కేటగరీ పెన్షన్లపై దృష్టి సారించిన ప్రభుత్వం రానున్న రోజుల్లో ఇంకా చాలా పెన్షన్లు తొలగించనుంది.
Also read: Union Budget 2025 Tax Slabs: ఆదాయం 12 లక్షలు దాటినా లాభమే, ఎవరికకెంత ఆదా అవుతుందో చూద్దామా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి