ఇటీవల వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని తప్పించి.. రోహిత్ శర్మకు ఆ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. దీంతో కెప్టెన్సీ మార్పు విషయంలో ఇద్దరి స్పందన ఏంటి అని చాలామంది ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ క్రమంలో తాజాగా కోహ్లీ కెప్టెన్సీ గురించి రోహిత్ స్పందించాడు.
కెప్టెన్సీ తొలగింపు విరాట్ కోహ్లీపై ఎలాంటి ప్రభావం చూపదని టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అన్నారు. రానున్న మ్యాచులలో కోహ్లీ రెట్టించిన ఉత్సాహంతో ఆడతాడని ధీమా వ్యక్తం చేశారు.
టీ20 ప్రపంచకప్ 2021లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ టాస్ సమయంలో పాక్ కెప్టెన్ బాబార్ ఆజమ్ టీమిండియా సారథి విరాట్ కోహ్లీతో ఏదో చెవిలో మాట్లాడాడు. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ వన్డే ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని ఉన్నపళంగా ఎందుకు తప్పించాల్సి వచ్చిందో తెలిపారు.
విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీ కోల్పోవడం ఒక విధంగా మంచిదే అని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల కెప్టెన్సీ భారం లేకపోవడంతో.. విరాట్ బ్యాటర్‌గా రాణించే అవకాశం ఉందని అంచనా వేశాడు.
దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ షాకింగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ టూర్లో వన్డే సిరీస్‌కు విరాట్ దూరంగా ఉండనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిసిస్తున్నాయి.
నేడు టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల పెళ్లి రోజు. విరుష్క జోడి వివాహ బంధంలోకి అడుగుపెట్టి శనివారంకు నాలుగేళ్లు పూర్తయ్యాయి.
టీమిండియా వన్డే కెప్టెన్సీ మార్పుపై విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ స్పందించారు. కెప్టెన్సీ మార్పు చేయడానికి గల కారణాన్ని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సరిగ్గా చెప్పలేకపోయిందన్నారు.
2021 సంవత్సరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి వ్యక్తిగతంగా ఏమాత్రం కలిసిరాలేదు. 2021 కోహ్లీకి దాదాపుగా నిద్రలేని రాత్రులనే మిగిల్చింది. ప్రస్తుతం టెస్ట్ సారథిగా ఉన్న కోహ్లీకి 2021 ఎలాంటి చేదు అనుభవాలను మిగిల్చిందో ఓసారి చూద్దాం.
టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించడంపై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా స్పందించాడు. కోహ్లీ విషయంలో బీసీసీఐ వ్యవహరించిన తీరును అతడు తప్పుబట్టాడు.
India squad for South Africa tour : దక్షిణాఫ్రికాలో పర్యటించబోయే భారత టెస్ట్ టీమ్ ఫైనల్ అయ్యింది. జట్టుకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లి వ్యవహరించనున్నారు. వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉండనున్నారు. 18 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది.
టీమిండియా తుది జట్టుపై ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆలోచనా విధానాన్ని అంచనా వేయడం కష్టమన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్'గా నిలిచిన వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను దక్షిణాఫ్రికాతో జరగబోయే టెస్ట్ సిరీస్‌లో పక్కకుపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని సెటైర్ వేశాడు.
న్యూజీలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో అభిమానులను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తనదైన శైలిలో పలకరించాడు. తాజాగా ఓ అభిమానికి బర్త్ డే విషెష్ చెప్పి ఆనందపరిచాడు.
Ajaz Patel Viral video: భారతీయ మూలాలున్న అజాజ్ పటేల్ అరుదైన ఘనత సాధించిన నేపథ్యంలో అతడిని అభినందించేందుకు విరాట్ కోహ్లీ, మొహమ్మద్ సిరాజ్, టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ ముగ్గురూ న్యూజిలాండ్ ఆటగాళ్లు కూర్చున్న చోటికి వెళ్లారు.
రెండో టెస్ట్ మ్యాచులో న్యూజీలాండ్ జట్టును భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫాలోఆన్ ఆడించకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ ఆటగాడు దినేష్ కార్తీక్ స్పందించాడు. కివీస్‌ను ఫాలోఆన్ ఆడించకపోవడానికి కారణం బౌలర్లకు విశ్రాంతినివ్వాలనే ఉద్దేశం మాత్రం కాదన్నాడు.
చాలా రోజుల విశ్రాంతి అనంతరం మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ.. అంపైర్ తప్పిదం వల్ల ఔట్ కావడంతో ఎంతో నిరాశగా మైదానం నుంచి డగౌట్‌కు బయలుదేరాడు. ఈ క్రమంలో బౌండరీ దగ్గరకు రాగానే ఆవేశంతో తన బ్యాట్‌ను బౌండరీ రోప్‌కు కొట్టాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.
న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో వాంఖడే మైదానంలో రెండో టెస్ట్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణంగా తొలి రోజు మొదటి సెషన్ కోల్పోవాల్సి వచ్చింది. మ్యాచ్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ బాధ్యతలు చేపట్టాడు.
Virat Kohli, Anushka Sharma's romantic pics: విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ జంట మీడియా ప్రపంచంలో ఓ హిట్ పెయిర్. సోషల్ మీడియాలో ఈ ఇద్దరి ఫోటోలు, వీడియోలు తరచుగా వైరల్ అవుతుంటాయి. విరాట్ కోహ్లీ కానీ లేదా అనుష్కా శర్మ ఏదైనా ఫోటో లేదా వీడియో షేర్ చేసుకున్నారంటే.. అది క్షణాల్లో వైరల్ అవడమే కాదు.. క్షణాల వ్యవధిలో మిలియన్స్ కొద్ది లైక్స్, వ్యూస్, షేర్స్ వచ్చిపడుతుంటాయి.
RCB to retain Virat Kohli and Glenn Maxwell: ఐపిఎల్ 2022 టోర్నమెంట్లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ మాజీ కెప్టేన్ విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ సేవలు వినియోగించుకోవాలని భావిస్తోంది. అందుకే ఐపిఎల్ 2022 వేలం కంటే ముందుగానే ఈ ఇద్దరు ఆటగాళ్లను రీటేన్ చేసుకోవాలని చూస్తోందట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.