Major Teaser: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా మేజర్ టీజర్ విడుదలైంది. 26/11 ముంబై దాడుల్లో (26/11 Mumbai attacks) దేశం కోసం ఉగ్రవాదులతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ రియల్ లైఫ్ ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. సందీప్ ఉన్నిక్రిష్ణన్ పాత్రలో అడవి శేష్ నటించాడు.
మైనే ప్యార్ కియా..లేదా ప్రేమ పావురాలు సినిమా గుర్తుంది కదా. సల్మాన్ ఖాన్ ( Salman khan ) తొలి సినిమా. బాలీవుడ్ బంపర్ హిట్ మూవీ. అన్ని భాషల్లోనూ హిట్ అయిన సినిమా. 1989లో విడుదలై అప్పట్లో ఓ సంచలనం. సంగీతపరంగా ఎవర్ గ్రీన్ హిట్. బాలీవుడ్లో ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ భాగ్యశ్రీ ( Bhagyashree ).. ప్రేమ పావురాలు తరువాత వెంటనే వ్యాపారవేత్త హిమాలయ దసానీని పెళ్లి చేసుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే భాగ్యశ్రీ..ఇటీవల ఫిట్నెస్ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తోంది. 51 ఏళ్ల వయస్సులో కూడా అందంగా..25 ఏళ్ల పడుచులా యవ్వనంగా కన్పిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆమె బ్యూటీ సీక్రెట్ అందరితో పంచుకుంటోంది
Swami Om passes away: ఢిల్లీ: తనకు తాను దేవుడిగా ప్రకటించుకుని పలు వివాదాల్లో తలదూర్చడంతో పాటు బిగ్ బాస్ 10 సీజన్లో కంటెస్టెంట్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్న స్వామి ఓం మృతి చెందాడు. మూడు నెలల క్రితం కొవిడ్ బారిన పడిన స్వామి ఓం.. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ పక్షవాతం రావడంతో మళ్లీ ఆస్పత్రిపాలయ్యాడు.
Bigg Boss 14: బుల్లితెరపై దేశంలో పాపులర్ షో బిగ్‌బాస్. హిందీలో బిగ్‌బాస్ సీజన్ 14 నడుస్తోందిప్పుడు. ఇప్పుడీ షోలో విషాదం చోటుచేసుకుంది. టాలెంట్ మేనేజర్ పిస్తా ధాకడ్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది.
మలైకా అరోరా రెండో పెళ్లికి సిద్ధమైనట్టు బాలీవుడ్ మీడియా బాహటంగానే చెప్పుకుంటోంది. తాను ఇష్టపడుతున్న అర్జున్ కపూర్‌ని రెండో పెళ్లి చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోందనేది ముంబై మీడియా కథనాల సారాంశం.
దేశంలో కరోనావైరస్ (Coronavirus)మహమ్మారి విజృంభణ రోజురోజూకు పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ప్రముఖులను కూడా కరోనా పట్టిపీడిస్తోంది. దీనివల్ల చాలామంది క్వారంటైన్లోకి వెళ్లాల్సి వస్తోంది.
SP Balu Health Condition | సింగర్ ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఆకాంక్షించారు. తన కోసం సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు ఎంతో ప్రత్యేకమని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
సల్మాన్ ఖాన్ హత్యకు ( Plot for Salman Khan's murder ) కుట్ర పన్నిన ఓ షార్ట్ షూటర్ని ఉత్తర ప్రదేశ్‌లోని ఫరిదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఓ వ్యక్తి హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కి ( Lawrence Bishnoi gang ) చెందిన ఓ షార్ప్ షూటర్ని ఫరిదాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నోరు మంచిదైతే ఊరు మందిచి అవుతుంది అంటారు. మంచోడికి ఊరంతా దోస్తులే అంటారు. ఈ రెండూ కూడా భారత మాజీ కెప్టెన్, ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ విషయంలో నిజంగా రుజువు అయ్యాయి. ధోనీకి క్రికెట్ ఫీల్డ్ లోనే కాదు సినిమా పరిశ్రమలో, ఇతర రంగాల్లో కూడా మంచి మిత్రులు ఉన్నారు.
బిగ్‌బాస్ హిందీ షో ప్రతిఏటా ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద సినిమాలకు రానంత క్రేజ్ హిందీ బిగ్‌బాస్‌కు వస్తుంది. ఈ హిందీ షోకి రేటింగ్స్ కూడా విపరీతంగా ఉంటాయి.
అవయవాలను దానం చేయాలని ప్రముఖ బాలీవుడ్ కపుల్ రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్స్ డేను పురస్కరించుకుని వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరణానంతరం తమ అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నట్టు జెనీలియా సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
బాలీవుడ్లో తక్కువ సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు మెహిత్ బఘేల్ (26) ( Mohit Baghel ) ఇక లేరు. గతేడాది డిసెంబర్ నుంచి క్యాన్సర్‌తో ( Cancer ) బాధపడుతూ ఉత్తర్ ప్రదేశ్‌లోని మథురలో చికిత్స పొందుతున్న మోహిత్ అదే వ్యాధితో కన్నుమూశారు.
షోయబ్ అక్తర్ రియల్ స్టోరీ ఆధారంగా బయోపిక్ (Shoaib Akhtar`s biopic) రూపొందిస్తే.. ఆ సినిమాలో షోయబ్ అక్తర్ పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తే బాగుంటుందట. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు.. స్వయంగా షోయబ్ అక్తరే తనపై బయోపిక్ వస్తే ఎలా ఉంటుందని చెబుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
ప్రభాస్ తన తర్వాతి సినిమాలో కత్రినా కైఫ్‌తో రొమాన్స్ చేస్తున్నాడా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. సాహో సినిమా సమయంలోనే కత్రినాను తీసుకోవాలని భావించినప్పటికీ అప్పట్లో అది సాధ్యపడలేదు. అయితే, తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందనున్న ప్రభాస్ 21వ సినిమాలో కత్రినానే హీరోయిన్గా తీసుకోవాలని ఫిలింమేకర్స్ భావిస్తున్నట్టుగా మరోసారి టాక్ తెరపైకొచ్చింది. దీనిపై బాలీవుడ్ మీడియా ఏమంటుందో ఇప్పుడు చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.