1983 ICC World Cup : 1983 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ (1983 Cricket World Cup ) లో భారత్ ఓటమి అంచునుంచి తప్పించుకోవడమే కాదు.. చరిత్రను తిరగరాసి మరీ విజయాన్ని సొంతం చేసుకుంది. కపిల్ దేవ్ టీమ్ ( Kapil Dev ) జాతికి గర్వకారణంగా నిలిచింది. ఈ విజయానికి నేటితో 37 ఏళ్లు పూర్తయ్యాయి.
5 వన్డేల సిరీస్ కోసం ప్రస్తుతం న్యూజీలాండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా తొలి వన్డేలో అద్భుతమైన విజయం సొంతం చేసుకుని సిరీస్‌లో పై చేయి సాధించిన సంగతి తెలిసిందే.
ఎప్పుడైనా గమనించిరా.. ధోనీ హెల్మెట్ పై జాతీయ జెండా చిహ్నం ఉండదు. సచిన్ దగ్గరి నుంచి విరాట్ కోహ్లీ వరకు టీమిండియా క్రికెటర్లందరి హెల్మెట్లపై జాతీయ జెండా కనిపిస్తుంది. కానీ ఒక్క ధోనీ హెల్మెట్ పైనే జాతీయ జెండా చిహ్నం ఎందుకు ఉండదు అనే ప్రశ్న తలెత్తుంది కదూ. దీనికి కారణం ధోనీకి దేశభక్తి లేకపోవడమనుకుంటే పొరపాటే..
కేప్‌టౌన్ వేదికగా భారత జట్టుతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని అవుట్ చేసిన క్షణాలు తనకు ఎప్పటికీ గుర్తుంటాయని అంటున్నారు దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ ఫిలాండర్.
క్రితం సంవత్సరమే అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించి వ్యాఖ్యాతగా స్థిరపడిన టీమిండియా మాజీ ఆటగాడు ఆశిష్ నెహ్రా ప్రస్తుతం ఇండియన్ బౌలర్లకు కోచింగ్ ఇవ్వనున్నాడని వార్తలు వస్తున్నాయి.
శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ రెచ్చిపోయి ఆడడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది.
ఫిఫా అండర్ 17 వరల్డ్ కప్ ఈ నెల 6వ తేది నుండి భారత్‌లో ప్రారంభమవుతున్న విషయం విదితమే. తొలిసారిగా అండర్ 17 విభాగంలో ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇస్తున్న భారత్, ఒక ఆతిథ్య దేశ హోదాలో ఒక టీమ్‌గా కూడా పోటీలో పాల్గొంటోంది. ఈ పోటీలో భాగంగా తన తొలి మ్యాచ్‌లో అమెరికాతో తలపడబోతోంది మన భారత జట్టు. ఈ సందర్బంగా భారత జట్టు ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ, కోహ్లీ ట్విటర్లో ఒక వీడియో పోస్టు చేశారు. "గుడ్ లక్ బాయ్స్.. మమ్మల్ని గర్వపడేలా చేయండి" అన్నది దాని సారాంశం. భారత ఫుట్ బాల్ జట్టు.. ఈ ట్వీట్‌కు ప్రతి ట్వీట్ చేస్తూ ధన్యవాదాలు కూడా చెప్పింది.
భారత క్రికెట్ జట్టులో ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అవుతున్న క్రికెటర్ హార్దిక్ పాండ్య. నిన్న మొన్నటి వరకు అతని ట్విటర్ ఫ్యాన్ పేజీల్లో ఒక అమ్మాయితో దిగిన సెల్ఫీ ఫోటో బాగా వైరల్ అయ్యింది. ఆ అమ్మాయి ఎవరై ఉంటుందా? అన్న విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆమె ఎవరు? అన్న విషయం మీద అతని అభిమానుల్లో భిన్నాభిప్రాయలు కూడా వెలువడ్డాయి. ఈ క్రమంలో ఆఖరికి ఈ విషయంపై హార్దిక్ స్పందించారు. ఆ మిస్టరీని ఛేదించారు. "మిస్టరీ వీడిపోయింది.. ఆమె నా సోదరి" అని చెప్పి ఆ విషయానికి స్వస్తి పలికారు.
టీం ఇండియా మంచి జోషు మీదుంది. వరుసగా తొమ్మిది వన్డేల్లో విజయం సాధించిన భారత జట్టు పదవ వన్డేలో కూడా విజయం సాధిస్తే వరుసగా పది వన్డేల్లో విజయం సాధించిన జట్టుగా టీం ఇండియా ఘనత సాధించనుంది. భారత వన్డే చరిత్రలో ఇదొక సరికొత్త అధ్యాయం. ఇప్పటి వరకు ఈ ఫీట్ ను న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ అందుకున్నాయి. ఇందుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికకానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.