దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీలోని తబ్లీగి జమాతే కరోనా కేసుల అంశం రాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే చాలా మందిని ఐసొలేషన్ కు తరలించినప్పటికీ దేశ రాజధానిలోని వివిధ మసీదులలో ఎక్కువ మంది విదేశీయులు ఉంటున్నారని దర్యాప్తులో తేలిందని కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలోని మసీదుల్లో ఉన్న మిగిలిన వారిని గుర్తించడానికి కేంద్రం, ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
కరోనావైరస్ వ్యాపించకుండా కేంద్రం తీసుకుంటున్న పఠిష్టమైన చర్యల్లో భాగంగా ఇప్పటికే దేశమంతా లాక్ డౌన్ పాటిస్తుండగా.. లాక్ డౌన్ కఠినంగా అమలయ్యేందుకు పోలీసులు వారి వంతు పాత్ర పోషిస్తూ జనాన్ని రోడ్లపైకి రాకుండా తీవ్ర కృషి చేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. నిజాముద్దీన్ మర్కజ్ భవనంలో ఉన్న వ్యక్తుల్లో చాలా మంది పాజిటివ్ లక్షణాలతో ఉన్నారు.
కరోనాపై పోరులో ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోందని, ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. 70 మంది కరోనా బాధితుల్లో 12 మంది కోలుకున్నారని, తెలంగాణలో వలస కూలీలు తొమ్మిది లక్షలకు పైగా ఉంటారని, వారికి నిత్యావసర వస్తువులు అందిస్తున్నామని, హైదరాబాద్‌లో 170 శిబిరాలు
ప్రాణాంతక కరోనా మహమ్మారి వ్యాప్తంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ ను ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా దేశ రాజధానిలో మరో ఐదు కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ పాజిటివ్ కేసుల సంఖ్య 30కి చేరింది. మరోవైపు దేశవ్యాప్తంగా
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో ఈ మహమ్మారి సంక్రమణకు గురికాకుండా 3000 మంది ఖైదీలను విడుదల చేస్తున్నట్లు తిహార్ జైలు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం జైళ్లలో వాటి సామర్థ్యానికి మించి ఖైదీలు ఉండడంతో ఒకవేళ వైరస్ విజృంభిస్తే ఖైదీలందరికీ వైరస్ సోకే అవకాశం ఉండడంతో
పెరుగుతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసుల దృష్ట్యా మార్చి 31 వరకు పాఠశాలలు, కళాశాలలతో పాటు సినిమా హాళ్ళను మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించిందని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇదే అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) మీడియా సమావేశంలో విలేకరులతో మాట్లాడుతూ..
ఇప్పటివరకు అక్కడో ఇక్కడో వాలిన కరోనా.. ఇప్పుడు ఏకంగా వెస్ట్ ఢిల్లీలోని ఏకంగా ఒక కుటుంబంలో ఏడుగురికి పాజిటివ్ అని తేలడంతో దేశమంతా ఉక్కిరిబిక్కరి అవుతోంది. వెస్ట్ ఢిల్లీలోనే 25 ఏళ్ల పేటీఎం ఉద్యోగి థాయిలాండ్ పర్యటన ముగించుకొని ఢిల్లీకి వచ్చాడు.
కరోనా వైరస్.. ఈ పేరు వినబడగానే ప్రతి ఒక్కరిలో వణుకు పుడుతుంది. గత వారం రోజుల క్రితం వరకు వరకు ప్రశాంతంగా ఉన్నా భారతదేశాన్ని ఇప్పుడు కరోనా భూతం కలవరపెడుతోంది. కాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి, రాష్ట్ర ప్రభుత్వాలకు తగు విదంగా సూచనలు చేస్తోంది. ఇటు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాపై అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి.
భారత్‌లోనూ కరోనావైరస్ కేసులు వెలుగు చూస్తుండటం ఆందోళనరేకెత్తిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ, తెలంగాణ, రాజస్థాన్‌లలో కరోనావైరస్ బయటపడటంతో కరోనా వైరస్ భారత్‌కి కూడా వ్యాపిస్తోందా అనే టెన్షన్ మొదలైంది.
ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్, నేడు ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను, గాయపడిన బాధిత కుటుంబాలను, తీవ్రమైన హింస జరిగిన ప్రాంతాలను సందర్శించారు.
దేశ రాజధాని, ఢిల్లీ అభివృద్ధి కోసం వచ్చే ఐదేళ్ల పాటు కేంద్రంతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసిన తరవాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ..
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఢిల్లీ హింస వెనుక ఎవరి హస్తం ఉంది ? ఆప్ నేత మద్దతుతోనే అల్లరిమూకలు హింసకు పాల్పడ్డాయా ? రాళ్లు రువ్వుతూ విధ్వంసానికి పాల్పడిన అల్లరి మూకలకు ఆప్ నేత తాహిర్ హుస్సేన్ ఆశ్రయం ఇచ్చారా ? తాహిర్ హుస్సేన్ ఇంటిపైకప్పుపై పెట్రోల్ బాంబులు, రాళ్లు, ఇటుక పెళ్లలు, సీసాలు ఎందుకున్నాయి ? ఢిల్లీ అల్లర్లలో ఎంత మంది చనిపోయారు ? ఢిల్లీ హింసలో అసాంఘీక శక్తులు ప్రవేశించాయా ? అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పౌరసత్వ సవరణ చట్టం నిరసనలు.. దేశ రాజధాని ఢిల్లీలో 17 మందిని బలిగొన్నాయి. మూడు రోజులుగా ఢిల్లీలోని పలు ప్రాంతాలు అట్టుడుకుతున్నాయి. పౌరసత్వ సరవణ చట్టం నిరసనకారులు, సమర్థించే వారి మధ్య చెలరేగిన ఆందోళనలతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాల ఘర్షణలో 150 మందికి పైగా గాయపడ్డారు.
ఢిల్లీలో మరో ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటన చిత్తరంజన్ పార్క్ వద్ద జరిగింది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు లోపల చిక్కుకున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు అరవింద్ కేజ్రీవాల్. ఆయనతోపాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వారందరితో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఢిల్లీలో మరోసారి సామూహిక శవాలు సంచలనం కలిగిస్తున్నాయి. గతంలో బురారీ ప్రాంతంలో వెలుగు చూసిన లాంటి ఘటనే మరోసారి ఢిల్లీలో కనిపించింది. ఒకే ఇంట్లో ఐదు మృతదేహాలు అనుమానస్పద స్థితిలో వెలుగులోకి వచ్చాయి.
ఒకే కాన్పులో ఒకరు లేదా ఇద్దరు పిల్లలు జన్మించడం సర్వసాధారణం. చాలా వరకు ఒకరు మాత్రమే పుడితారు. ఐతే కొంత మంది మహిళలు ఇద్దరికి కూడా జన్మనిస్తారు. అలా పుట్టిన వారిని కవల పిల్లలు అంటారు. కానీ దేశ రాజధాని ఢిల్లీలో ఓ అద్భుతం జరిగింది. ఒకేసారి జత కవలలు జన్మించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.