ప్రభుత్వాలకు ఆదాయ మార్గాలలో సినిమా రంగం ఒకటి. కానీ కరోనా మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీలను సైతం కష్టాలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో కరోనా ప్రభావం అంతగా లేని ప్రాంతాల్లో చైనా ప్రభుత్వం అనుమతించగా థియేటర్లను (Cinema Theatres reopend in China) మళ్లీ తెరిచారు.
భారత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల అనంతరం రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath singh) ప్రస్తుత పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం లేహ్‌ను సందర్శించిన రాజనాథ్ సింగ్.. శనివారం జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు.
గాల్వన్ లోయలో ఉద్రిక్తత అనంతరం చైనాకు డిజిటల్ సర్జికల్ స్ట్రైక్స్‌తో కేంద్ర ప్రభుత్వం బుద్ధి చెప్పింది. 59 చైనా యాప్‌లపై నిషేధం (India's Decision Over TikTok) విధించడం తెలిసిందే.
అమెరికా-చైనాల మధ్య పోరు రోజు రోజుకు పెరగుతోంది. కరోనా మహమ్మారి చైనా నుండే ఉద్భవించిందని ఇప్పటికే అమెరికా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ ను నిషేధించే దిశగా యోచిస్తోంది.
https://zeenews.india.com/telugu/tags/rahul-gandhiభారత్, చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై, ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ కనుగొనేందుకు విస్తృతమైన పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా సంస్థ సైనోవాక్ కీలక ప్రకటన చేసింది.
కరోనావైరస్ విషయంలో అమెరికా, చైనా మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. చైనానే కరోనా వైరస్ మహమ్మారిని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిచేసిందని, అది చైనీస్ వైరస్, వుహాన్ వైరస్ అంటూ చాలా సందర్భాల్లో అధ్యక్షుడు ట్రంప్ బహిరంగంగా ఆగ్రహం వెళ్లగక్కారు. అయితే ఈ సారి ట్రంప్ కరోనా విషయంపై మాట్లాడకుండా చైనా వల్ల జరిగిన నష్టం గురించి ప్రస్తావించారు.
చైనా (china) భూ దాహానికి అంతులేకుండా పోతోంది. కరోనా వైరస్ (Coronavirus) ను మొత్తం ప్రపంచానికి వ్యాప్తిచేసిందన్న ఆరోపణల తరువాత చైనా అనేక దేశాలతో సంబంధాలను తెంచుకుంటూ ఘర్షణలకు దిగుతూ వస్తోంది. ఇటీవలనే భారతదేశం (india-china), మయన్మార్, జపాన్ తరువాత, చైనా ఇప్పుడు రష్యా (russia)కు వ్యతిరేకంగా కయ్యానికి కాలుదువ్వుతోంది.
చైనాలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది. స్వైన్ ఫ్లూ కంటే డేంజర్ వైరస్‌గా జి4 అని నిపుణులు వెల్లడించారు. మనుషులకు తేలికగా సోకే లక్షణాలు జి4 వైరస్ కు ఉన్నాయని చైనా ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది.
గాల్వన్ లోయలో భారత సైనికులపై చైనా దురాఘతానికి పాల్పడ్డనాటి నుంచి దేశంలో చైనా వస్తువులను, యాప్‌లను నిషేధించాలన్న డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే కేంద్రం చైనాకు చెందిన 59 యాప్‌లను సోమవారం నిషేధిస్తూ ఉత్తర్వులు (59 Chinese apps banned) జారీ చేసింది.
లడఖ్‌లో చైనా సైన్యం 20 మంది భారతీయ సైనికులను హతమార్చినందుకు నిరసనగా కోల్‌కతాలోని జోమాటో ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం ఉద్యోగుల బృందం శనివారం వారి టీషర్టులను కాల్చి నిరసన తెలియజేశారు.
India Vs China | గాల్వన్ లోయ వివాదంలో 20 మంది భారత జవాన్లు అమరులైన తర్వాత భారత్, చైనాల మధ్య పరిస్థితులు కాస్త ఉద్రికత్తంగా మారాయి. ముఖ్యంగా భారత్‌లో చైనా వ్యతిరేఖ పవనాలు వీస్తున్నాయి. అయితే తమ మద్దతు భారత్‌కే ఉంటుందని అమెరికా స్పష్టం చేసింది.
2020లో భారత ఆర్థిక వ్యవస్థ(India Economy) భారీగా పతనం అవుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. అయితే ఈ ఏడాది అన్ని ప్రాంతాల వృద్ధి రేటు తగ్గుతుందని ఐఎంఎఫ్ అంచనా వేయడం మాత్రం ఇదే మొదటిసారి.
India vs China: ఇండో చైనా సరిహద్దులో ( Indo china border ) తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో ఒకవేళ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే భారత్‌కు రష్యా నుంచి సహకారం అందుతుందా ? ఇవాళ మాస్కోలో జరిగిన రష్యన్ డే పరేడ్‌లో ( Russian victory day parade ) భారత ఆర్మీ పాల్గొనడం దేనికి సంకేతాలిస్తోంది అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Army Chief MM Naravane: న్యూ ఢిల్లీ: లడక్ సరిహద్దులో భారత్, చైనా సైనికుల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవాణే ( MM Naravane ) మంగళవారం లఢక్ చేరుకున్నారు. లఢక్‌లోని తూర్పు సరిహద్దులో భారత్, చైనా సైనికుల మధ్య నెలకొన్న ఘర్షణ తరువాత పరిస్థితి గంటగంటకు మారుతోంది.
గాల్వన్ లోయ(Galwan Valley)లో వారం రోజుల కిందట జరిగిన ఘర్షణలో తెలంగాణ వాసి కల్నల్ బికుమళ్ల సంతోష్ బాబు సహా 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. అయితే తమ జవాన్ల మరణాలపై నోరు విప్పకుండా కాలయాపన చేస్తున్న చైనా ఎట్టకేలకు స్పందించిది. కానీ 1962 యుద్ధాన్ని మరోసారి రిపీట్ చేస్తామంటూ హెచ్చరికలు పంపడం గమనార్హం.
భారతీయ వినియోగదారుల మొత్తం సమాచారాన్ని సేకరిస్తున్న చైనాకు చెందిన 52 యాప్స్‌ను అడ్డుకోవాలంటూ ఇటీవల ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రధాని నరేంద్ర మోదీకి నేరుగా విజ్ఞప్తి చేశాయంటూ వార్తలు వచ్చాయి.
గాల్వన్ లోయ వివాదం ఘటనలో కొంత మంది భారత సైనికులు, ఉన్నతాధికారులను చైనా బంధించింది. అయితే చైనాతో ఉన్నతాధికారులు మూడుసార్లు భేటీ ఫలితంగా 10 మంది భారత జవాన్లు వారి చెర నుంచి విముక్తి పొందారు. భారత్, చైనాల మధ్య పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి.
భారత్ - చైనా సరిహద్దుల్లో చైనా బలగాలతో హోరాహోరి తలపడి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు.. తెలుగు నేలపై పుట్టిన భరత మాత ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు అంతిమ యాత్రలో ప్రముఖులు, ప్రజానికం భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జోహార్లు సంతోష్ బాబు నినాదాలతో సూర్యాపేట మార్మోగింది.భరత మాత ముద్దు బిడ్డ సంతోష్ బాబుకు ఘన నివాళి అర్పించేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన జనంతో సూర్యాపేట జన సంద్రమైంది.
భారత్ - చైనా సరిహద్దుల్లో చైనా బలగాలతో హోరాహోరి తలపడి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు.. తెలుగు నేలపై పుట్టిన భరత మాత ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు అంతిమ యాత్రలో భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రముఖులు, ప్రజానికం. సూర్యాపేట జోహార్లు సంతోష్ బాబు నినాదాలతో మార్మోగింది.భరత మాత ముద్దు బిడ్డ సంతోష్ బాబుకు ఘన నివాళి అర్పించేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన జనంతో సూర్యాపేట జన సంద్రమైంది. #ColSantoshBabu #ColonelSantoshBabu #SalutesToColSantoshBabu #SantoshBabu
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.