Parliament Budget Sessions: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గత నెల 31న రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమైంది. అదే రోజు కేంద్ర ఆర్ధిక మంత్రి ఆర్ధిక సర్వేను ప్రవేశపెట్టారు. అంతేకాదు ఈ నెల 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ చారిత్రకమైనదిగా నిలిచిపోయింది. ఈ బడ్జెట్ లో వేతన జీవులకు భారీ ఊరట కల్పిస్తూ ఏకంగా రూ. 12 లక్షల వరకు ఆదాయ పన్ను పరిమితి విధించడంతో ఇది అందరి మన్ననలు అందుకుంది. తాజాగా పార్లమెంట్ ముందుకు నిర్మలమ్మ కీలక బిల్లును తీసుకురాబోతుంది.
Union Budget 2025: 2025 -26 కేంద్ర బడ్జెట్ చరిత్రలో నిలిచిపోనుంది. ముఖ్యంగా వేతన జీవులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆదాయ పన్ను పరిమితిని భారీగా పెంచడం పెద్ద ఊరట కలిగించే అంశం. అదే విధంగా దేశంలో డిఫెన్స్ , వ్యవసాయం, ఇరిగేషన్ సహా దేశంలో విభిన్న రంగాలకు ఏ మేరకు ఎంత కేటాయించరనే విషయానికొస్తే..
Budget 2025 Live Updates: 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టనుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బడ్జెట్‌కు సంబంధించిన లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎంతో కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కార్పోరేట్ రంగంలో పనిచేసే వేతన జీవులు తాజాగా కేంద్రం ప్రకటించిన శ్లాబ్ సిస్టంతో ఎంతో లాభపడనున్నారు. తాజాగా పెంచి ఇంకమ్ శ్లాబు పరిమితిని రూ. 8 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 ఆర్ధిక సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. మొత్తంగా ఈ నిర్ణయంతో దాదాపు ప్రతి వంద కుటుంబాల్లో దాదాపు 40 శాతం మంది లాభపడునున్నారు.
Budget 2025: 2025-26 బడ్జెట్ చరిత్రలో నిలిచిపోనుంది. వేతన జీవులతో పాటు సామాన్యులు, రైతులు, పేదలతో పాటు మిడిల్ క్లాస్ వారికి అనుకూలంగా ఈ బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా ఈ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ వాహానాల ధరలు భారీగా తగ్గనున్నాయి.
Union Budget 2025: ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ .. ఉదయం 11 గంటలకు లోక్ సభలో 2025-26 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా పలు రంగాలకు ప్రోత్సహాకాలు ప్రకటించారు. ముఖ్యంగా బడ్జెట్ లో సోలార్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ కు ప్రత్యేక ప్రోత్సహాకాలు ప్రకటించారు.
Union Budget 2025: దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠ ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చింది. ఉదయం బడ్జెట్ ప్రతులను తీసుకొని రాష్ట్రపతి ని కలిసిన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ .. 11 గంటలకు లోక్ సభలో 2025-26 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా నిర్మలా తెలుగు కవి గురుజాడ పదాలను గుర్తు చేసుకున్నారు.
Union Budget 2025: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి. 2025-26కు సంబంధించి కేంద్ర వార్షిక బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశ ఆర్థిక భవిష్యత్‌కు నిర్ణయాత్మక ఘట్టమైన 'బడ్జెట్' కోసం కార్పొరేట్ కంపెనీల నుంచి కామన్ మ్యాన్ వరకు ప్రతి ఒక్కరూ బడ్జెట్ గురించి ఆశగా ఎదురు చూస్తున్నారు.
Union Budget 2025: కోట్లాది ప్రజలు ఎదురు చూసే రోజు రానే వచ్చింది. ముఖ్యంగా బడా పారిశ్రామికవేత్తలు, పేదలకు ఈ బడ్జెట్ తో పెద్దగా ఒనగూరే ప్రయోజనం లేదనేది ఆర్ధిక వేత్తలు చెప్పేమాట. పన్నులు పెంచినా.. తగ్గించినా.. వీరిపై పెద్దగా ప్రభావం ఉండదు. అదే మిడిల్ క్లాస్ కామన్ మ్యానే పన్ను పెరిగినా.. తగ్గినా.. వారిపైనే ఎక్కువ ప్రభావం ఉంటుంద. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సారి ప్రకటించిన ఆర్ధిక సర్వేలే తెలంగాణ సత్తా చాటింది.
Major Changes in Income Tax: కేంద్ర బడ్జెట్‌కు సమయం ఆసన్నమైంది. రేపు (ఫిబ్రవరి 1) ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌పై ట్యాక్స్ పేయర్లు భారీ ఆశలే పెట్టుకున్నారు. పన్ను శ్లాబులు మారుస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. ఆదాయపు పన్ను మార్పులు చేస్తే.. మధ్యతరగతి ప్రజలకు గొప్ప ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
Budget 2025: ఆదాయపు పన్నుకు కీలక మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. పది లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు కల్పించడంతోపాటు కొత్తగా 25% శ్లాబ్ ను తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Budget 2025: ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ఉండనుంది. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించే బడ్జెట్ సామాన్యులపై కూడా ప్రభావం చూపుతుంది. కేంద్ర బడ్జెట్ ప్రజల ఆదాయాన్ని నేరుగా ప్రభావితం చేసే విషయమని తెలిసిందే. అయితే ఈ సారి కేంద్ర బడ్జెట్ సామాన్య ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపనుందో తెలుసుకుందాం.
Budget 2025: దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకుని పసిడి ప్రియులకు షాకిచ్చాయి. హైదరాబాద్ లో తులం స్వచ్చమైన బంగారం ధర రూ. 82వేలు దాటింది. ఇక ట్యాక్స్, ఛార్జీలు కలిపితే మరింత పెరుగుతుంది. బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ పెంచుతారన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో బడ్జెట్ తర్వాత బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి. బులియన్ మార్కెట్ విశ్లేషకులు ఏం చెబుతున్నారు. తెలుసుకుందాం.
Budget 2025: ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్న బడ్జెట్ సెషన్ లో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇది కొత్త చట్టం, ప్రస్తుత చట్టానికి సవరణ కాదు. బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. మొదటి భాగం (జనవరి 31-ఫిబ్రవరి 13) లోక్‌సభ, రాజ్యసభ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించడంతో ప్రారంభమవుతుంది. పార్లమెంట్లో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రవేశపెట్టడానికి సంబంధించి ఇప్పటివరకు వచ్చిన సమాచారం తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.