Revanth Reddy About KCR and Dharani Portal Scam: ఈ 75 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు ఇలాంటి దోపిడీకి పాల్పడలేదు అని చెబుతూ.. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును అసెంబ్లీ ప్రాంగణంలో చెట్టుకు ఉరేసి చంపినా తప్పు లేదు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గల్ఫ్ దేశాల్లోలా కేటీఆర్‌ను రాళ్లతో కొట్టి చంపినా తప్పు లేదు అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
Bandi Sanjay Warning to KCR: బీఆర్ఎస్ మాదిరిగా రాజకీయ వ్యభిచారం చేయబోమని, ఇతర పార్టీల నుండి వచ్చే వాళ్లు పదవులకు రాజీనామా చేసిన తరువాతే బీజేపీలోకి తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ధరణి మంచి పోర్టల్ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ‘‘ధరణి వల్ల లాభపడింది కేసీఆర్ కుటుంబం మాత్రమే. ఆ కుటుంబం లాక్కున్న భూములను రెగ్యులరైజ్ చేసుకోవడానికే ధరణి తెచ్చారు. ఆ పోర్టల్ బాధితులతో ఏకంగా బహిరంగ సభ నిర్వహించవచ్చు’’అంటూ ఎద్దేవా చేశారు.
Rajnath Singh: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రియాంకాను సీజనల్ హిందూవుగా అభివర్ణిస్తూ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Telangana bjp chief bandi sanjay: తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెక్ బౌన్సర్ సీఎం అని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో రైతులు బతికే పరిస్థితి లేదని కేసిఆర్ పుణ్యమా అని రైతులు బ్యాంకులలో డిఫాల్టర్లుగా నమోదయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు.
AP Politics: ఏపీలో హఠాత్తుగా రాజకీయ వాతావరణం మారిపోయింది. కేంద్రంలోని బీజేపీ వర్సెస్ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ వైర్ ప్రారంభమైంది. జేపీ నడ్డా, అమిత్ షా వ్యాఖ్యలకు దీటుగా సమాధానమిస్తున్నారు వైసీపీ నేతలు.
Minister Harish Rao: మహాభారతంలో కౌరవుల్లాగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక్కడ గౌరవెల్లి ప్రాజెక్టును ఆపాలని ఎంతో ప్రయత్నం చేశారు. కానీ చివరకు న్యాయం గెలిచి ధర్మం నిలబడ్డట్టు మేము రైతుల కోసం, ప్రజల కోసం చేపట్టిన గౌరవెల్లి ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశాం.
Revanth Reddy About Rythu Bandhu Scheme: రాజకీయాలనే భవిష్యత్తుగా మార్చుకుని ప్రజా సేవ చేయాలనుకునే వారికి యూత్ కాంగ్రెస్ ఒక మంచి వేదిక అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నాయకుడుగా మారడానికి యూత్ కాంగ్రెస్ ఒక చక్కటి వేదిక అవుతుంది అని చెప్పడానికి తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేనే మనకు ఒక ఉదాహరణ అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
Bandi Sanjay Kumar Comments on KCR, BJP and Congress: ఈనెల 15న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్న నేపథ్యంలో అమిత్ షా తెలంగాణ పర్యటనను సక్సెస్ చేయాలి అని తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
BRS MLA Jeevan Reddy Challenges Dharmapuri Aravind: నిజామాబాద్ ఎంపీ అరవింద్.. నీకు దమ్మూ ధైర్యం ఉంటే ఆర్మూర్ నియోజకవర్గంలో నాపై పోటీ చెయ్యి అని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ధర్మపురి అరవింద్ కి సవాల్ విసిరారు.
BRS MLC Kalvakuntla Kavitha: “బీఆర్ఎస్ పార్టీ కుటుంబం చాలా పెద్దది. కేసీఆర్ మనస్సు పెద్దది. బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు ఇతర పార్టీల బహిరంగ సభల కంటే పెద్దగా జరుగుతున్నాయి. గులాబీ కండువా కప్పుకున్న వాళ్లందరికీ పెద్ద బాధ్యత ఉంటుంది. గులాబీ కండువా కప్పుకున్నామంటే తెలంగాణ ప్రజలకు గులాముల్లాగా పనిచేయాలి" అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
Third Front: దేశంలో 2024 ఎన్నికలకు రాజకీయ పార్టీలు సమాయత్తమౌతున్నాయి. ఎన్డీయే, యూపీఏలకు ప్రత్యామ్నాయంగా మూడవ కూటమి సూచనలు కన్పిస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఈ దిశగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం బీజేపీ-టీడీపీ పొత్తుల చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి.
YS Sharmila Slams BJP, BRS: బీఆర్ఎస్ పార్టీ, బీజేపి మధ్య రహస్య స్నేహం ఉందన్న వైఎస్ షర్మిల.. ఈ రెండు పార్టీల తీరు లోకం ముందు నువ్వు కొట్టినట్లు చేస్తే.. నేను ఏడ్చినట్లు చేస్తా.. అన్న చందంగా ఉంది అని ఎద్దేవా చేశారు. అంతటితో ఊరుకోని వైఎస్ షర్మిల.. ఇంతకీ మీరు నడిపే రహస్య దోస్తానం ప్రీ పోల్ ఒప్పందమా ? లేక పోస్ట్ పోల్ ఒప్పందమా ? అని సూటిగానే ప్రశ్నించారు.
Chandrababu Naidu Amit Shah Meeting: టీడీపీతో బీజేపీ పొత్తు అని వస్తున్న వార్తలు అన్నీ ఊహజనితమేనని కొట్టిపారేశారు బండి సంజయ్. అమిత్ షాను చంద్రబాబు కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. వీరు పొత్తులపైనే చర్చించారనేది కరెక్ట్ కాదన్నారు.
Telangana Formation Day : తెలంగాణలో కుటుంబ పాలనతో ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దొరికి అన్ని చోట్లా అప్పులు తెస్తున్నారని, తెలంగాణ తెచ్చుకున్నది అప్పుల కోసమా? అని నిలదీశారు. నిధులు రాక సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నాడు.
Telangana Farmationday : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుతామని కేంద్రం ప్రకటించడంతో బీఆర్ఎస్ ఇరకాటంలో పడినట్టు అయింది. వేడుకలు నిర్వహిస్తున్న విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. గోల్కొండ కోటలో ఘనంగా ఈ వేడుకలు జరుపబోతోన్నట్టుగా తెలిపారు
9 Years Of PM Modi: మోదీ 9 ఏళ్ల పాలనపై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. 9yearsofseva.bjp.org పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన బండి సంజయ్... మోదీ ప్రభుత్వానికి మిస్డ్ కాల్ ద్వారా మద్దతు పలకాలి అని కోరుతూ 9090902024 నెంబర్ ను విడుదల చేశారు.
Bandi Sanjay Tweets on BRS Govt Failures: బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా ఎత్తిచూపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. చిన్నపాటి వర్షానికే నీట మునిగిన హైదరాబాద్ రోడ్ల నీట మునుగుతున్నాయని అన్నారు.
Ex Minister Vivek : పార్టీ మారుతున్నట్టుగా వస్తోన్న రూమర్లను ఖండించాడు మాజీ ఎంపీ, బీజేపీ జాతియ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ నియంత పాలనను ముగింపు పలకడానికి, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాటం ఆగదని వివేక్ అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.