Tilak Verma T20 Records : చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టి20 మ్యాచ్లో టీమిండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ సూపర్ హాఫ్ సెంచరీ చేసి ఒంటి చేత్తో భారత్ కు విజయాన్ని అందించాడు. 72 పరుగులు బాదీ కష్టాల్లో ఉన్న జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో తిలక్ వర్మ సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పేరు మీద ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. భారత్ తరఫున వరుసగా 4 టీ20 లో కలిసి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ గా తిలక్ వర్మ హిస్టరీ క్రియేట్ చేశారు.
నాలుగు ఇన్నింగ్స్ లో కలిపి 318 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా రన్ మిషన్ కోహ్లీ 258 పరుగులను అధిగమించాడు. ఈ జాబితాలో సంజూ శాంసన్, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ తర్వాతి స్థానంలో ఉన్నారు. తాజా ఇన్నింగ్స్ తో తిలక్ వరల్డ్ రికార్డు బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ టీ20లో అవుట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా తిలక్ వర్మ రికార్డులోకి ఎక్కాడు.
Also Read: PM Modi: గణతంత్ర వేడుకలు .. స్పెషల్ అట్రాక్షన్ గా ప్రధాని మోదీ తలపాగా
ఈ మ్యాచ్ లో నాటౌట్ గా 72 పరుగులు పడిన తిలక్ వర్మ ఇంతకుముందు మూడు ఇన్నింగ్స్ లో 107, 120, 19, 72 పరుగులు చేశాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ బ్యాటర్ మార్క్ చాప్ మన్ ను అధిగమించాడు.
మ్యాచ్ ముగించడం ఆనందాన్ని ఇస్తుంది. నిరంతరం శ్రమిస్తూనే ఉంటాను. కష్టపడడమే మన చేతుల్లో ఉంటుంది. మిగతా పైవాడు చూసుకుంటాడు. మరోవైపు రవి కూడా బాగా ఆడాడు. వీల్లింగ్ స్టోన్ బౌలింగ్లో ఫోర్ బాది ఒత్తిడి తగ్గించాడు. నా మైండ్ లో మ్యాచ్ ఫినిష్ చేయాలి అని ఒకటే ఫిక్స్ అయ్యాను. మ్యాచ్ ముగిసిన తర్వాత చూశా నా స్కోర్ 72. నా జెర్సీ నెంబర్ కూడా 72. ఆ విషయం నాకు మ్యాచ్ తర్వాత తెలిసింది అని తిలక్ వర్మ అన్నాడు
A game-changing flick 👌🏻
A number "72" coincidence 🤔
A thrilling Chepauk Chase 🔝..In the words of "Won"der Men - Tilak Varma & Ravi Bishnoi 😎
WATCH 🎥🔽 - By @28anand & @mihirlee_58 #TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank
— BCCI (@BCCI) January 26, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి