Rpf lady constable duty with her child in new delhi video: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇటీవల ఘోరమైన తొక్కిసలాట చోటు చేసుకుంది. కుంభమేళ రైలు ఎక్కేందుకు ఒక్కసారిగా ప్రయాణికులు మూకుమ్మడిగా రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. అప్పటికే కుంభమేళలకు వెళ్లాల్సిన ట్రైన్లు ఆలస్యం కావడం.. ఒకే ట్రైన్ మాత్రమే ఉందంటూ పుకార్లు.. రైల్వే అధికారుల అనౌన్స్ మెంట్ లో పొరపాట్ల వల్ల మొత్తంగా 18 మంది నిండు ప్రాణాలు కోల్పోగా.. 40 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటన సమయంలో ప్రతి గంటకు కూడా.. దాదాపు.. 1500 వందల జనరల్ టికెట్లను ప్రయాణికులకు ఇచ్చారంట. దీన్ని బట్టి చూస్తే ఏ విధంగా ప్రయాణికులు భారీగా వచ్చారో అర్థం చేసుకొవచ్చు. మరోవైపు ఈ ఘటనలో చాలా మంది ప్లాట్ ఫామ్ అనౌన్స్ మెంట్ తప్పిదం వల్లనే జరిగిందని కూడా ఆరోపణలు చేస్తున్నారు. మొత్తంగా కుంభమేళకు వెళ్లే యాత్రికులు మాత్రం చాలా చోట్ల ఇబ్బందులు పడుతున్నారు
Unfortunately, she is failing to deliver on her duties as both a mother and an RPF constable, a role for which she is remunerated. It is regrettable that such behavior is lauded and regarded as achievements and sacrifices, as we are emotionally susceptible. https://t.co/UlA8KqwxXY
— Abhijit (@BlackKn59506535) February 17, 2025
.
ఇండియన్ రైల్వేస్ ఎన్ని ట్రైన్ లు నడిపిస్తున్నా కూడా.. కుంభమేళకు భారీగా జనాలు పొటెత్తుతున్నారు. ప్రస్తుతం ఫిబ్రవరి 26 మహా శివరాత్రి చివరి షాహీస్నానం మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో అధికారులు మాత్రం ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు ఒక లేడీ కానిస్టేబుల్ ఢిల్లీ రైల్వేస్టేషన్ లో తన చంటి బిడ్డను ఎత్తుకుని విధుల్లో నిమగ్నమైంది.
ఒకవైపు తన చంటి బిడ్డను చూసుకుంటునే మరోవైపు ప్లాట్ ఫామ్ మీద ప్రయాణికులు గుమి గూడకుండా.. ఆమె కంట్రోల్ చేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గామారింది. నెటిజన్లు లేడీ కానిస్టేబుల్ డెడికేషన్ కు ఫిదా అవుతున్నారు. మరికొందరు నెటిజన్ లు రియల్ కానిస్టేబుల్ సిన్సియారిటీకి సలాం కొట్టాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter