Maha Shivratri: మొదటి సారి మహా శివరాత్రి వేళ ఉపవాసం ఉంటున్నారా...?.. ఈ తప్పులు అస్సలు చేయోద్దంట..

Maha shivratri puja: భక్తులు మహా శివరాత్రిని ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అయితే.. ఈరోజున తెల్లవారుజామున నిద్రలేచీ ముక్కంటికి అభిషేకాలు, పూజాదికాలు చేస్తుంటారు.

1 /6

మహా శివరాత్రిని పర్వదినాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా చేసుకుంటారు.  ఈసారి మనం మహాశివరాత్రిని ఫిబ్రవరి 26న జరుపుకోబోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా శుభసమయం ఉందని పండితులు చెబుతున్నారు.

2 /6

అయితే.. ముఖ్యంగా శివరాత్రి రోజున చాలా మంది ఉపవాసాలు ఉండటం, జాగరణలు చేయడం చేస్తుంటారు. ఈ క్రమంలో మొదటి సారి  శివరాత్రి వేళ ఉపవాసాలు చేసేటప్పుడు భక్తులు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి.

3 /6

శివరాత్రి అనేది చాలా పవిత్రమైన తిథి.  ఈరోజున ముఖ్యంగా శివుడ్ని ఆరాధిస్తే జీవితంలోని ఎంత పెద్ద సమస్యలైన కూడా ఇట్టేదూరమైపోతాయి.  శివరాత్రి రోజున మొదటిసారి ఉపవాసాలు చేసే వారు... రోజంతా భక్తితో శివుడ్ని మాత్రమే స్మరించుకుంటు ఉండాలి.

4 /6

శక్తి ఉంటే రోజంత పాలు తాగి, పండ్లు తిని కొందరు ఉపవాసాలు చేస్తారు. మరికొందరు సాబుదాన  లేదా మరేదైన టిఫిన్ లు తింటారు. శివరాత్రి రోజున టిపిన్ లలో అస్సలు.. వెల్లుల్లీ, ఉల్లీపాయలు ఉండకుండా చూసుకొవాలి.

5 /6

అంతే కాకుండా.. శివరాత్రి వేళ ప్రతి ఒక్కరు తెల్లని వస్త్రాలు ధరించి, శివుడ్ని ఆరాధించాలని తెల్లని పూలతో శివుడ్ని ఆరాధిస్తే ఆయన అనుగ్రహం కల్గుతుందని పండితులు చెబుతుంటారు.

6 /6

శివరాత్రి రాత్రంతా కూడా జాగరణం చేయలేని వారు కనీసం.. రాత్రి 12 గంటల వరకైన మేల్కొని శివుడ్ని ధ్యానిస్తు ఉండాలని పండితులు చెబుతున్నారు. ఇలాంటి పనులు చేస్తే జీవితంలోని అన్నిరకాల ఆర్థిక సమస్యలతో పాటు,  కుటుంబ సమస్యల నుంచి బైటపడొచ్చని పండితులు చెబుతున్నారు.