Rs 200 Note Ban: మళ్లీ నోట్ల రద్దు? రూ.200 నోట్లు రద్దయ్యాయా? వాస్తవమేమిటి?

Is It New 200 Rupee Notes Ban Here RBI Clarification: భారత కరెన్సీ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతుంటుంది. నకిలీ నోట్లు.. భద్రతకు సంబంధించి మార్పులు చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని రద్దవుతుంటాయి. తాజాగా రూ.200 నోట్లు రద్దయ్యాయనే ప్రచారం జరుగుతోంది. మరి నిజంగా రూ.200 నోటు రద్దయ్యిందా? అందులో వాస్తవమెంత? ఆర్‌బీఐ ఏం చెబుతుందో తెలుసుకుందాం.

1 /5

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.వెయ్యి నోట్లను నిషేధించిన విషయం తెలిసిందే. రూ.200 నోట్ల రద్దు చేస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. అన్ని రూ.200 నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటున్నారా? ఈ పుకార్లపై ఆర్‌బీఐ ఏమి చెప్పిందో తెలుసా? మార్కెట్లో నకిలీ రూ.200, రూ.500 నోట్లు బాగా పెరిగాయనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల పెద్ద సంఖ్యలో నకిలీ నోట్లు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలోనే రూ.200 నోట్లు రద్దు చేశారనే ప్రచారం సాగుతోంది.

2 /5

రూ.200 నోట్ల రద్దు పుకార్లపై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ముఖ్యమైన మార్గదర్శకాలను విడుల చేసింది. నోట్ల రద్దు ఊహాగానాలేనని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఎటువంటి నోట్లను ఉపసంహరించుకోబోమని ప్రకటించింది.

3 /5

ఆర్‌బీఐ చేసిన ప్రకటన ప్రకారం ప్రస్తుతం రూ.200 నోట్ల రద్దు లేదు. అయితే నకిలీ నోట్ల భారీగా పెరగడం.. మార్కెట్‌లో చలామణీ అవుతుండడంతో ప్రజలు ఆ నోట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

4 /5

నకిలీ నోట్ల చెలామణి గణనీయంగా పెరుగుతుండడంతో అసలు.. ఆర్‌బీఐ జారీ చేసిన రూ.200 నోటు ఎలా తెలుసుకోవాలో కొన్ని చిట్కాలు ఉన్నాయి.

5 /5

రూ.200 నోటు ఎడమ వైపున 200 అని దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది. మధ్యలో గాంధీజీ బొమ్మ ఉంది. 'ఆర్‌బీఐ', 'భారత్', '200' అనేవి చిన్న అక్షరాలతో రాసి ఉంటాయి. కుడివైపున అశోక స్థూపం స్మారకం ఉంటుంది. నకిలీ నోట్లను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని ఆర్‌బీఐ విజ్ఞప్తి చేసింది.