Hot Weather: భగభగ.. మార్చి 1వ తేదీ నుంచి ఎండలు దంచుడే..!

March 1st OnwardsHot Weather: ఏడాది ఫిబ్రవరిలోనే ఎండలు బాగా మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు చాలా ఒక ఉక్కపోతకు గురవుతున్నారు. ఫిబ్రవరి ప్రారంభం ముందే ఎండల వేడిమి ఎక్కువైంది. పొడి వాతావరణం ఏర్పడుతుంది.. అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ ఈ నేపథ్యంలో కీలక సూచన చేసింది. మార్చి 1వ తేదీ నుంచి మరింత జాగ్రత్త ఉండాలని సూచించింది.
 

1 /5

హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రజలకు కీలక సూచన చేసింది. ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుంచి జాగ్రత్త వహించాలని కోరింది. తెలంగాణలో ఈ ఏడాది ఎండలు ఎక్కువ ఉండటంతో ఈ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.    

2 /5

ఈ ఏడాది ఫిబ్రవరి నెల నుంచి ఎండల వేడిమి బాగా ఎక్కువైంది వాతావరణంలో ఉక్కపోత మొదలైంది. అంతేకాదు ఎండ వేడిమితో వాతావరణం పూర్తిగా పొడిగా పోతుంది. మధ్యాహ్నం ఎండలు తీవ్రత ఎక్కువ అవుతుంది. అయితే మార్చి 1వ తేదీ నుంచి మరింత జాగ్రత్త తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది.

3 /5

ఈ నేపథ్యంలో నిన్న రాష్ట్రవ్యాప్తంగా 35 డిగ్రీల నుంచి 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా జగిత్యాల నిర్మల్, గింగాపూర్, నాగర్ కర్నూల్, పెద్ద మద్దూరు పెంచికల్‌ పేట తదితర ప్రాంతాల్లో 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.  

4 /5

 ఇలా మార్చి రాక ముందే పెద్ద ఎత్తున 38 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో మార్చి ఒకటి నుంచి ఈ ఎండల బీభత్సం మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.  

5 /5

వర్షాలు, చలి బీభత్సం ఈసారి ఎండ ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుందని తెలిపింది. పసిపిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించింది. ఎండల సమయంలో బయటకు రాకపోవడమే నయం. నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలని తెలిపింది.