Shani Dev Effect: మార్చి 2న భాద్రపద నక్షత్రంలోకి శని.. ఈ రాశులవారికి గోల్డెన్‌ ఆఫర్స్.. డబ్బే, డబ్బు!

Shani In Bhadrapada Nakshatra Effect On Zodiac: శని భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రాశులవారు అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. జీవితంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. 
 

Shani In Bhadrapada Nakshatra: శని గ్రహం చాలా అరుదుగా రాశి సంచార చేస్తే, నక్షత్ర సంచారం అప్పుడప్పుడు చేస్తుంది. శని రాశి, నక్షత్ర సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారిపై చాలా అరుదైన ప్రభావం పడుతుంది. దీని వల్ల కొన్ని రాశులవారు తీవ్ర నష్టాల బారిన పడితే.. మరికొన్ని రాశులవారు అద్భుతమైన ధన లాభాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ గ్రహం శుభ స్థానంలో ఉన్న రాశులవారికి శని దేవుడి అనుగ్రహం కూడా కలుగుతుంది.
 

1 /7

శని గ్రహం మార్చి 28న కుంభ రాశి నుంచి నేరుగా మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అయితే దీనికి ముందు నక్షత్ర సంచారం చేస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇలా నక్షత్ర సంచారం చేసే క్రమంలో శని జాతకంలో శుభ స్థానంలో ఉంటే బోలెడు లాభాలు కలుగుతాయి. ఈ సమయం నుంచే జీవితంలో ఆనందం రావడం కూడా ప్రారంభమవుతుంది.   

2 /7

శని గ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రంలో పుష్య, అనురాధతో పాటు ఉత్తరాభాద్ర నక్షత్రాలకు అధిపతి పరిగణిస్తారు. అయితే ఈ నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. మార్చి 2న శని భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించబోతోంది. దీని వల్ల ఈ కింది రాశులవారికి బోలెడు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.   

3 /7

శని భాద్రపద నక్షత్రంలో సంచారం చేయడం వల్ల మకర రాశివారికి చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభించడమే కాకుండా బోలెడు ఆర్థిక లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరికి జీవితంలో ఆనందంతో పాటు మంచి రోజులు రాబోతున్నాయి.   

4 /7

మకర రాశివారికి ఆధ్యాత్మిక కార్యకలాపాలపై కూడా ఆసక్తి రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్‌ కూడా కలుగుతాయి. వీరికి ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది.   

5 /7

శని నక్షత్ర మార్పుల కారణంగా మీన రాశివారికి కూడా జీవితంలో మార్పులు రావడం ప్రారంభమవుతాయి. వీరికి ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. జీవితంలో శాంతి కూడా రెట్టింపు అవుతుంది. అలాగే విద్యార్థులు కూడా విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి.   

6 /7

మీన రాశివారు ఈ సమయంలో చదువులపై దృష్టి పెట్టడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు. అంతేకాకుండా వీరికి సమాజంలో కూడా ఊహించని స్థాయిలో గౌరవం పెరుగుతుంది. అలాగే వ్యాపారాలు చేసేవారికి ఆర్థికంగా బోలెడు లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా భారీ లాభాలు పొందుతారు.  

7 /7

సింహ రాశి వారికి శని సంచారం వల్ల చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి కుటుంబంలో శాంతితో పాటు ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే కొత్త ఆదాయ వనరలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుంచి కాస్త పరిష్కారం లభిస్తుంది. జీతం కూడా భారీ మొత్తంలో పెరుగుతుంది.