Indiramma Indlu: ఇందిరమ్మ ఇల్లు రాలేదని బాధపడకండి..కేంద్రం నుంచి మరో ఇల్లు..ఇది మీకోమే

Free Housing Scheme:  పేదలకు ఫ్రీగా శాశ్వత ఇండ్లను అందించేందుకు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015లొ ప్రారంభించింది. అయితే ఇప్పటికీ చాలా మంది ఈ స్కీమును పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయారు. దీన్ని ద్రుష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మరోసారి సర్వే నిర్వహిస్తోంది. 
 

1 /7

ఇల్లు లేని వారికి కొత్త ఇల్లు కట్టుకునేందుకు లేదా కొనుగోలు చేసేందుకు సాయం అందిస్తుంది. ఈ స్కీమ్ కింద ఆర్థిక సహాయం లేదా సబ్సిడీ లభిస్తుంది. అర్హత కలిగిన వారు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

2 /7

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో పట్ణణ ప్రాంతాల్లో ప్రజల జీవన నాణ్యత మెరుగుపరిచేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రజలకు మరిన్ని ప్రయోజనాలను అందించనున్నారు.

3 /7

బడ్జెట్ లో ఈ పథకం ఏకంగా రూ. 10లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పట్ణణ ప్రాంతాల్లోని కోటి కుటుంబాలకు ఈ ప్రయోజనాలను బదిలీ చేయనున్నట్లు ప్రకటించారు. 

4 /7

ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీముకు దరఖాస్తు చేసుకునే వ్యక్తి ఈ క్రింది అర్హతలు ఉండాలి. ఇల్లు లేని కుటుంబం అయ్యిండాలి. కేవలం ఒకటి లేదా రెండు గదుల కచ్చా గ్రుహంలో నివసిస్తున్న కుటుంబాలు దరఖాస్తు చేసుకోవచ్చు. 25ళఏళ్ల పైబడిన అక్షరాస్యులు లేని కుటుంబాలు అర్హులు.

5 /7

సామర్థ్యం లేని కుటుంబ సభ్యులు ఉన్నవారు, వికలాంగులు, వ్రుద్ధులు కూడా అర్హులు. భూమిలేని కుటుంబాలు, రోజువారీ కూలీలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనార్టీలు అర్హత కలిగినవారిలోకి వస్తారు.   

6 /7

దరఖాస్తుదారుడు భారత పౌరుడు అయి ఉండాలి. 18సంవత్సరాలు పైబడినవారు మాత్రమే అప్లయ్ చేసుకోవచ్చు. వార్షిక ఆదాయం రూ. 3లక్షల నుంచి 6లక్షల మధ్య ఉండాలి. దరఖాస్తుదారుని పేరు రేషన్ కార్డు లేదా బీపీఎల్ జాబితాలో ఉండాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అవసరం.

7 /7

ఆధార్ కార్డు లేదా ఆధార్ నెంబర్, రేషన్ కార్డు లేదా  బీపీఎల్ సర్టిఫికేట్  జాబ్ కార్డ్ లేదా జాబ్ కార్డ్ నెంబర్, బ్యాంక్ పాస్ బుక్, స్వచ్చ భారత్ మిషన్ నమోదు సంఖ్య,అవసరం ఉంటుంది. మీ సేవా లేదా ప్రజా సేవా కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.