Airtel: ఎయిర్‌టెల్‌ రూ. 2249 VS రూ.1849 ప్లాన్‌.. ఈ ప్లాన్‌లో ఎక్కువ బెనిఫిట్స్‌ తెలుసా?

Airtel 2249 Vs 1849:  ఎయిర్‌టెల్‌ ఇటీవలె వాయిస్‌ ప్లాన్స్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది ఫీచర్‌ ఫోన్స్‌ ఉపయోగించే వినియోగదారులకు బెస్ట్‌. అయితే, ఎయిర్‌టెల్‌ అందిస్తోన్న రూ.2249 వెర్సస్‌ రూ.1849 ప్లాన్‌. ఈరెండిటిలో బెస్ట్‌ ప్లాన్‌ ఏది? పూర్తి వివరాలు ఇవే..
 

1 /5

ఎయిర్‌టెల్‌ ఈ టెలికాం  కంపెనీ తక్కువ ధరలోనే సరికొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇటీవలె ట్రయ్‌ ఆదేశాల మేరకు రెండు వాయిస్‌ ఓన్లీ ప్లాన్స్‌ కూడా తీసుకువచ్చింది. అయితే, ఎక్కువ రోజుల వ్యాలిడిటీ అతితక్కవ ధరలో ఏ ప్లాన్స్‌ ఉన్నాయి తెలుసుకుందాం..  

2 /5

ఎయిర్‌టెల్ రూ. 2249 ప్లాన్..  ఎయిర్‌టెల్ అందిస్తున్న రూ. 2249 ప్లాన్ కూడా ఏడాది పాటు వ్యాలిడిటీ అందుతుంది. ఎయిర్‌టెల్ వినియోగదారులకు ఇది బంపర్ ఆఫర్ అపరిమిత వాయిస్ కాలింగ్ తక్కువ ధరలోనే పొందుతారు.

3 /5

 ఇందులో 30 జీబీ డేటా పొందుతారు 3600 ఎస్ఎంఎస్ లు కూడా ఉచితంగా పొందుతారు. ఇది కాకుండా స్పామ్‌ కాల్‌ ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌ కూడా పొందుతారు. దీంతోపాటు అపోలో 24/7 సర్కిల్ కూడా పొందుతారు.  

4 /5

ప్లాన్ రూ. 1849.. ఎయిర్‌టెల్ అందిస్తున్న మరో అద్భుతమైన ప్లాన్ రూ. 1849 ధరలో అందుబాటులో ఉంది. ఇటీవల ట్రయ్‌ ఆదేశాల వరకు వాయిస్ ఓన్లీ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫీచర్ ఫోన్ ఉపయోగించేవారికి ఏడాది పాటు హాయిగా ఈ రీఛార్జి ప్లాన్ తో ఎంజాయ్ చేయవచ్చు.

5 /5

 ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు 3600 ఎస్ఎంఎస్ ఉచితంగా పొందుతారు దీంట్లో కూడా స్పామ్ కాల్స్ ఎస్ఎంఎస్ అలర్ట్ తో పాటు అపోలో 24/7 సర్కిల్ కూడా పొందుతారు..