Shukra Retrograde: త్వరలో ఈ రాశుల వారికి రాజభోగం.. వ్యాపారంలో లాభం..బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం గ్యారంటీ..

Shukra Retrograde: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహ మండలంలో గ్రహాలు నిరంతరం సంచరిస్తూ ఉంటాయి. ఇలా సంచరిస్తూ ఉండటం వలన కొన్ని రాశుల వారి జీవితంలో అనూహ్య మార్పులు సంభవిస్తాయి. అంతేకాదు కెరీర్, వ్యాపారంలో అనూహ్య విజయాలను అందుకుంటూ ఉంటారు. శుక్రుడు మీనరాశిలో వక్ర గమనంలో ప్రవేశించడం వలన ఈ రాశుల వారి జీవితాల్లో అనుకోని మార్పులు రాబోతున్నాయి. 

  • Feb 22, 2025, 06:45 AM IST
1 /8

శుక్రుడు మార్చిలో వక్ర గమనంలో ప్రవేశించడం వలన కొన్ని రాశుల వారి  జీవితాల్లో ఆర్థిక శ్రేయస్సును తీసుకొస్తోంది. ముఖ్యంగా శుక్రుడు తిరోగమనం వలన కొంతమంది జీవితాల్లో శుక్ర దశ ప్రారంభం కాబోతుంది.  ఇది కెరీర్, వ్యాపారంలో విజయానికి దోహదం చేస్తుంది. అంతేకాదు భారీ మొత్తంలో డబ్బు సంపాదించడానికీ ఉపకరిస్తోంది.

2 /8

జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్రుడు.. ప్రేమ, సంపద, డబ్బు అందానికి కారకుడని చెబుతారు.  శుక్రుడు, మార్చి 2, 2025న మీన రాశిలో తన మార్గాన్ని మార్చుకొని తిరోగమనంలో ప్రయాణించబోతున్నాడు.

3 /8

మీన రాశి: శుక్రుని ప్రభావం కారణంగా, ఈ రాశి వారి జీవితాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వీరి ఇంట్లో వివాహం వంటి శుభకార్యాలు జరుగుతాయి. వృత్తి నిపుణులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో ఆకస్మిక ఆర్థిక ధనలాభం ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగే అవకాశాలున్నాయి.

4 /8

ధనుస్సు రాశి: శుక్రుని సంచారము ధనుస్సు రాశి వారికి వారి కెరీర్‌లో ఉజ్వల భవిష్యత్తును అందించబోతుంది. అంతేకాదు డబ్బు పరంగా పెట్టుబడుల నుండి లాభాలను పొందవచ్చు. వివాహంలో మీ అహాన్ని వదులుకోకపోతే, గొడవలు తలెత్తుతాయి. ఆస్తి సంబంధిత లావాదేవీలలో విజయం సాధిస్తారు.

5 /8

తులా రాశి: శుక్రుడు వక్ర గమనం వలన  ఈ రాశి వారి జీవితాలను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. కొన్ని ముఖ్యమైన లావాదేవీల కోసం పెద్ద మొత్తంలో డబ్బు అవసరం కావచ్చు. అయితే, ఆకస్మిక ఆర్థిక లాభాలు కలుగుతాయి. వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. వైవాహిక జీవితంలో ఆనందకరైన సమయం అంటున్నారు.

6 /8

కుంభ రాశి: శుక్రుని వక్ర గమనం ప్రభావం కారణంగా, ఈ రాశి వారు తమ కష్టానికి తగిన ఫలాలను పొందుతారు. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఆదాయం పెరుగుతుంది.

7 /8

మేష రాశి: మేష రాశి వారికి శుక్రుని ప్రభావం వల్ల చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బులు చేతికి అందుతాయి. కాంట్రాక్టర్లు పనులు దక్కించుకుంటారు. అంతేకాదు వీరి కెరీర్,  వ్యాపారంలో గొప్ప విజయాన్ని అందుకుంటారు. వ్యాపారస్తులకు ఒక్కసారిగా  ఆదాయం పెరిగే ఛాన్సెస్ అవుతున్నాయి. 

8 /8

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు, ఇంటర్నెట్ లో అందించిన సమాచారం ఆధారంగా ఇచ్చాము. ZEE NEWS దీనిని ధృవీకరించడం లేదు.