MLA Pocharam Srinivas Reddy Vs MLA Thota Laxmi Kantha Rao: కామారెడ్డి జిల్లా బాన్సు వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మధ్య దూరం పెరిగినట్టు తెలుస్తోంది. ఇద్దరు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అయినప్పటికీ.. ఇసుక అక్రమ రవాణా ఇద్దరు నేతల మధ్య అగ్గి రాజేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఇటీవల కామారెడ్డి జిల్లా జుక్కల్ ఇసుక అక్రమ రవాణా విపరీతంగా పెరిగింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలంటూ ఆదేశించారు. దాంతో రంగంలోకి దిగిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు తన నియోజకవర్గంలో ఇసుక రవాణాను అడ్డుకోవాలని పోలీసులను ఆదేశించారు. దాంతో పోచారం వర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుపై భగ్గుమంటున్నట్టు సమాచారం..
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన మాజీమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పార్టీ మారారు.. ఆయన తన సొంత వ్యాపారాల కోసమే పార్టీ మారినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి.. ఇసుక వ్యాపారంలో కోట్లు వెనకేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.. గతంలో బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉండగా.. జుక్కల్ నియోజకవర్గంలో ఆయన వ్యాపారం మూడు పువ్వులు- ఆరు కాయలు అన్నట్టుగా సాగిందట. అప్పట్లో జుక్కల్ ఎమ్మెల్యేగా కూడా బీఆర్‌ఎస్‌కు చెందిన నేతే ఉండటంతో పోచారం వ్యాపారాలను చూసిచూడనట్టు వదిలేశారట. దాంతో అప్పట్లో పోచారం అనుచరులు ఓ రేంజ్‌లో ఇసుక రవాణాను కంటిన్యూ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాపారాన్నీ కంటిన్యూ చేస్తున్నారు..
తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన మాజీ స్పీకర్ పోచారం ఇసుక దందాకు ఇబ్బందిగా మారిందట. ఇన్నాళ్లు ఇసుక దందాలో కోట్లు వెనకేసుకున్న పోచారం అనుచరులు.. తాజాగా ఇసుక దాందాను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అడ్డుకోవడంతో పరేషన్ అవుతున్నారట. గతంలో మాదిరిగా తన నియోజకవర్గంలో ఇసుక దందాను చేయనిచ్చేది లేదని ఎమ్మెల్యే తేల్చి చెప్పడంతో ఏం చేయాలో పాలుపోక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. తన అనుమతి లేకుండా నియోజకవర్గంలో ఇసుక దందా ఎలా చేస్తారంటూ.. ఇసుక క్వారీలను మూసివేయించారట. దాంతో పోచారం వర్గం ఇసుక క్వారీలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతుండటం హాట్ టాపిక్ అయ్యింది. ప్రభుత్వం నుంచి ఆఫీషియల్‌గా అనుమతి వస్తే.. యథేచ్చగా ఇసుకదందా చేసుకోవచ్చని పోచారం వర్గం భావిస్తోందట. అయితే ప్రభుత్వం ఇసుక క్వారీలకు అనుమతులు ఇచ్చే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు..
మొత్తంగా ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఇసుక పంచాయితీ తారాస్థాయికి చేరుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇసుక దందాను అడ్డుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుపై మాజీమంత్రి పోచారం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఒకే వేదికపై కలుసుకున్న నేతలు.. కనీసం ముఖాలు చూసుకునేందుకు ఇష్టపడలేదట.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు నేతలు కల్పించుకుని ఇరు వర్గాలను సర్ధిచెప్పినా.. ఇద్దరు నేతలు తగ్గేదేలేదు అనడంతో.. ఈ లొల్లి ఎక్కడి వరకు వెళ్తుందోనని పార్టీ నేతలు టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది.
Also Read: Viral Video: వెన్నులో వణుకు పుట్టిస్తున్న వీడియో.. రెప్పపాటులో ఘోర ప్రమాదం నుంచి బైటపడ్డ బుడ్డొడు..
Also Read: One Nation One Gold Rate: గోల్డ్ రేట్స్ ను కంట్రోల్ చేసేందుకు మాస్టర్ ప్లాన్..అదేంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter