Japan firm offers hangover leaves: కంపెనీలోని ఉద్యోగులకు తాగినంత మందును కంపెనీ వాళ్లు సరఫరా చేస్తారు. దీంతో సదరు కంపెనీలో చేరేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది.
సాధారణంగా ఐటీ కంపెనీలన్ని స్కిల్ ఆధారంగా రిక్రూట్ చేసుకుంటాయి. కేవలం క్వాలీఫికేషన్ పైనమాత్రమే కాకుండా.. సదరు అభ్యర్థి దగ్గర ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి మొదలైన వాటిని ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటున్నాయి.
ఒకప్పటిలా ఇప్పుడు కంపెనీలు ఈజీగా రిక్రూట్ మెంట్ ప్రాసేస్ చేయడం లేదు. ఎంతో మందిని వడబోస్తున్నాయి. మొత్తంగా జెమ్ గా ఉన్నవాళ్లను మాత్రమే సెలక్ట్ చేస్తున్నాయి. దీంతో యువత కూడా తమ స్కిల్ ను పెంచుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే.. కంపెనీలో చేరిన తర్వాత ఉద్యోగులకు కంపెనీ వాళ్ల మంచి ప్యాకేజీలు ఇస్తుంటాయి. దీనితో పాటు గోల్స్ రీచ్ అయిన వాళ్లకు ఇన్సెంటివ్స్ ఇస్తుంటాయి. అంతేకాకుండా.. విదేశాలకు టూర్ లు, సెల్ ఫోన్ లు, లాప్ టాప్ లు ఇలా రకరకాల ప్రొత్సాహాకాలు ఇస్తుంటాయి.
కొన్ని కంపెనీలలో ఉద్యోగులకు ఒత్తిడిలేకుండా చర్యలు తీసుకుంటాయి. కంపెనీలలో పనివేళల్లో నిద్ర వచ్చిన స్లిపింగ్ అవర్స్ అని రకరకాలుగా వారికి ఒక వైపు రెస్ట్ ఇస్తునే మరోవైపు వారి నుంచి మంచి ప్రొడక్టివిటీ వచ్చేలా చేస్తుంటాయి.
అయితే.. జపాన్ లోని ట్రస్ట్ రింగ్ కంపెనీ కాస్త ఇన్నోవేటివ్ గా ఆలోచించిది.తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు తాగినంత మద్యంతో అందిస్తున్నారు. దీనితో పాటు.. హ్యాంగోవర్ లీవ్స్ కూడా ఇస్తున్నారు. దీంతో ఈ కంపెనీలో చాలా మంది చేరేందుకు అక్కడి యువత ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో సదరు కంపెనీలలో ప్యాకేజీ ఎక్కువగా లేకున్న కూడా యువత ఎక్కువ మంది ఈ కంపెనీలనో చేరుతున్నారంట.
మరోవైపు యువత అడిగినంత ప్యాకేజీ ఇవ్వలేక.. ఈ విధంగా వారిని మ్యానేజ్ చేస్తున్నారని అక్కడి వాళ్లు అంటున్నారు. మొత్తంగా సదరు కంపెనీ ఉద్యోగులకు ఇస్తున్న ఆఫర్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీని చూసి చాలా మంది వావ్ అంటున్నారు. మరికొందరు ఏందీ భయ్యా.. ఈ ఆఫర్ అంటూ విస్తు పోతున్నారంట.