Rose Water: రోజ్‌ వాటర్‌ ఇలా వాడితే ముఖం కాంతివంతం.. జుట్టుకు రెండురెట్ల బలం..

Rose Water Beauty Benefits: రోజ్ వాటర్ సహజ సిద్ధంగా మంచి ఆరోమో కలిగి ఉంటుంది. గులాబీ రెక్కలతో ఈ రోజ్‌ వాటర్‌ను తయారు చేస్తారు. రోజ్ వాటర్ హెయిర్ కేర్ రొటీన్ లో కూడా చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మన జుట్టుకు హైడ్రేషన్ కూడా అందిస్తుంది. ఇందులో అరోమెటిక్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి.  రోజ్‌వాటర్‌ విటమిన్ , యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజాలు చర్మం జుట్టుకు మేలు చేస్తాయి.

Written by - Renuka Godugu | Last Updated : Feb 10, 2025, 01:25 PM IST
Rose Water: రోజ్‌ వాటర్‌ ఇలా వాడితే ముఖం కాంతివంతం.. జుట్టుకు రెండురెట్ల బలం..

Rose Water Beauty Benefits:  రోజ్ వాటర్ చర్మానికి ఉపయోగించడం వల్ల పిహెచ్ స్థాయిలో అదుపులో ఉంటాయి. మంచి రీఫ్రెష్మెంట్‌ కూడా అందిస్తుంది. చర్మ రంగు కూడా మెరుగవుతుంది .ముఖానికి మాయిశ్చర్ అందుతుంది. రోజ్ వాటర్ నేచురల్ టోనర్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇది ఓపెన్ ఫోర్ సమస్యకు చెక్ పెడుతుంది. అంటే ముఖంపై ఉండే రంధ్రాలను తగ్గించేస్తుంది. రోజ్‌ వాటర్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. చర్మంపై ఉండే మచ్చలు దురదలను తొలగిస్తుంది. కొంతమందికి చర్మం ఎరుపు రంగులోకి మారుతుంది. రోజ్ వాటర్ వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇది చర్మానికి మంచి హైడ్రేషన్ అందించి మృదువుగా.. పునరుజ్జీవనం చర్మానికి అందిస్తుంది.

రోజ్ వాటర్ జుట్టుకు కూడా మేలు చేస్తుంది. ఇది మంచి హైడ్రేషన్ అందిస్తుంది. ఎండాకాలం రోజ్‌ వాటర్‌ ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇది ఆరోగ్యకరమైన కుదుళ్లకు తోడ్పడుతుంది. కుదుళ్లు పొడిబారకుండా బ్లడ్ సర్కులేషన్ కూడా మెరుగు పరుస్తుంది. రోజ్ వాటర్ ఉపయోగించడం వల్ల మీ జుట్టు సహజసిద్ధంగా మెరుస్తూ కనిపిస్తుంది ..ముఖ్యంగా స్ప్లిట్‌ ఎండ్‌ సమస్యలను తగ్గిస్తుంది. ఇది మంచి హెయిర్ టానిక్ కు సహజసిద్ధంగా కూడా ఉపయోగించవచ్చు రోజ్‌ వాటర్‌ అన్ని రకాల చర్మాలకు వర్తిస్తుంది.

ఇదీ చదవండి:  చర్మం, జుట్టుకు యాలకులు చేసే అద్భుతం ఇదే.. నమ్మలేని ప్రయోజనాలు..

రోజ్ వాటర్ ను నేరుగా ముఖంపై వాడొచ్చు. ఈ నీటిని కాటన్‌ ప్యాడ్‌ సహాయంతో ముఖాన్ని రుద్దుకోవాలి. మంచి హైడ్రేషన్ ముఖానికి అందిస్తుంది. లేదా ఒక టేబుల్ స్పూన్ తేనే ,పెరుగు కలిపి రోజ్ వాటర్ ని ముఖానికి అప్లై చేసి ఫేస్ మాస్క్‌ కూడా వేసుకోవచ్చు. దీంతో మీ ముఖం కాంతివంతంగా మారుతుంది. రోజ్‌వాటర్ ను ముఖంపై స్ప్రే చేసుకోవటం వల్ల ట్యాన్‌ తగ్గిపోతుంది. ఇందులో మెడిసినల్‌ గుణాలు కలిగి ఉంటాయి. ఇక రోజ్ వాటర్, నిమ్మరసం రెండు సమపాళ్లలో కలిపి అప్లై చేయడం వల్ల ముఖంపై ఉండే నల్ల మచ్చలు త్వరగా తగ్గిపోయి.. ముఖం కాంతివంతంగా మారుతుంది.

ఇక జుట్టు సమస్యలకు రోజ్ వాటర్ ను వినియోగించాలంటే రోజ్ వాటర్ నీటిని కలిపి ఒక స్ప్రే బాటిల్‌లో వేసుకోవాలి. తలస్నానం చేసిన తర్వాత జుట్టు అంతటికీ స్ప్రే చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఇక రోజ్‌ వాటర్ ను కలబందతో కూడా కలిపి అప్లై చేసుకోవచ్చు. దీంతో పొడిబారడాన్ని తగ్గిస్తుంది, దురదలు రాకుండా నివారిస్తుంది. ఇక తలస్నానం చేసిన తర్వాత గ్లిజరిన్ తో కలిపి రోజ్ వాటర్ మంచి కండీషనర్ గా కూడా ఉపయోగించవచ్చు. దీనికి రెండు టేబుల్ స్పూన్ల రోజు వాటర్‌లో ఒక స్పూన్ గ్లిజరిన్ వేసి కండిషనర్‌ అప్లై చేసుకోవచ్చు.

 రోజ్‌ వాటర్ ను కొబ్బరి నూనెలో కూడా కలిపి మన తలంతటికీ అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇది హెయిర్ సమస్యలను తగ్గించే మంచి టానిక్‌ అని చెప్పవచ్చు. లేదా ఏదైనా ఆయిల్స్ లో కూడా వేసి రోజ్‌ వాటర్‌ను జుట్టుకు బాగా అప్లై చేయడం వల్ల తలలో రక్త ప్రసరణకు ప్రేరేపిస్తుంది.. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

ఇదీ చదవండి:  జంక్ ఫుడ్ బదులు.. గుప్పెడు సన్‌ఫ్లవర్ సీడ్స్ తింటే మీ గుండె గట్టిదవుతుంది..

రోజ్‌ వాటర్‌ను కాటన్ ప్యాడ్ తీసుకొని కళ్ల చుట్టూ అప్లై చేయడం వల్ల కంటి చుట్టూ ఉండే వాపు సమస్యలకు కూడా ఎఫెక్ట్ రెమిడీగా పనిచేస్తుంది.. ఇది కళ్లకు మంచి రిఫ్రెష్మెంట్ కూడా అందిస్తుంది. దీంతో మీ కళ్ళు ఆరోగ్యంగా అందంగా కనిపిస్తాయి. డార్క్ సర్కిల్స్ కి కూడా ఎఫెక్ట్ గంధంలో రోస్ వాటర్ కలిపి కళ్ళ చుట్టూ అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇది కాకుండా బియ్యం పిండిలో రోజ్ వాటర్, అలోవెరా జెల్ కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల మంచి ఫేస్ ప్యాక్ రెడీ అవుతుంది. ఇందులో కావాలంటే విటమిన్ ఈ ఆయిల్ కూడా కలపవచ్చు ఇది చర్మానికి మంచి హైడ్రేషన్ కూడా అందిస్తుంది. రోజ్ వాటర్ పడుకునే ముందు ముఖానికి అప్లై చేసి ఉదయం ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల ముఖం కాంతివంతంగా అవుతుంది. ఇలా రోజు చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. రోజ్‌ వాటర్ తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అన్ని చర్మాలవారికి ఇది నప్పుతుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News