Revanth Reddy Apology: అన్నింట్లో విఫలమైన రేవంత్ రెడ్డి పాలనతో తెలంగాణ కుక్కలు చింపిన విస్తరిలా మారిందని.. 14 నెలలైనా ఇంకా మాజీ సీఎం కేసీఆర్‌పై ఏడుపా? అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల గణన అంటూ తప్పుల తడక చేసి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రేవంత్ రెడ్డి చేసిన చిల్లర ప్రయత్నం అని మండిపడ్డారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే పక్కా అని స్పష్టం చేశారు. దీనిపై ఎలాంటి విచారణ అయినా కూడా చేసుకోమని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జగదీశ్ రావు సవాల్ చేశారు.
సూర్యాపేటలో గురువారం జగదీశ్ రెడ్డి మీడితో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చేపట్టిన కుల గణనను తప్పుబట్టారు. బీసీ జనాభా లెక్కలపై విస్మయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డిపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కుక్కలు చింపిన విస్తరిలా కాంగ్రెస్ పాలన తయారైందని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేతకావడం లేదని విమర్శించారు. కొంతమంది అనామకులు తామున్నామని చెప్పుకోవడానికే అప్పుడప్పుడు మొరుగుతున్నారని పరోక్షంగా కోమటిరెడ్డి సోదరులకు కౌంటర్ ఇచ్చారు.
Also Read: Foreign Liquor: మద్యం ప్రియులకు జాక్‌పాట్.. ఒకే దుకాణం మూడు బ్రాండ్ల మద్యం
'కేసీఆర్ చేపట్టిన సర్వేనే కరెక్ట్.. రేవంత్ సర్వే అంతా బోగస్ అని మీ పార్టీ నాయకులే అంటున్నారు. కేసీఆర్ సర్వే అంటే దేశ విదేశాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు' అని సూర్యాపేట బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి పాలన చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. జనాభా తగ్గించి చూపితే మన రాష్ట్రానికి నష్టమనే సోయిలేదా అని నిలదీశారు. స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి మోసానికి కాంగ్రెస్ కుట్రలు పన్నిందని ఆరోపించారు. చివరికి ప్రజల్లో తేటతెల్లం అయ్యేసరికి చేతులెత్తేసిందని తెలిపారు.
రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. ఇకనైనా చెంపలేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన మ్యానిఫెస్టో హామీలను పూర్తిగా అమలుచేయాలని కోరారు. బీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్‌పై ఆరోపణలు వదిలేసి అభివృద్ధి, హామీల అమలుపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు. 14 నెలలు గడుస్తున్నా కేసీఆర్ మీద ఏడుపు మానుకోవాలని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.