Avocado Fruit Health Benefits: పోషకాలకు పవర్ హౌస్ అయినా అవకాడోలో మోనోఅన్శాచ్యురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ప్రత్యేకంగా ఇందులో ఒలియాక్ యాసిడ్ ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేసి, మంచి కొలెస్ట్రాల స్థాయిలను పెంచుతుంది. వీటిని మన రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల ప్రయోజనాలు పుష్కలం. ముఖ్యంగా ఇందులో పొటాషియం ఉంటుంది. బిపి రోగులకు ఇది మేలు చేస్తుంది. సోడియం స్థాయిలను అదుపులో ఉంచుతుంది. దీంతో కార్డియో ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే అవకాడోను మన డైట్ లో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..
అవకాడోలో కరగని ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది. దీంతో మలబద్ధక సమస్య కూడా రాదు. పేగు ఆరోగ్యం దెబ్బతినకుండా కాపాడుతుంది. అవకాడోలో ఉన్న కరిగే ఫైబర్ మన ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్‌కు ఎంతో మేలు చేస్తుంది. ఇది క్రీమీ రూపంలో ఉంటుంది.
అవకాడోలో లూటీన్, జియాన్తిన్ అనే రెండు పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కెరోటినాయిడ్స్ హానికర అల్ట్రా వైలట్ రేస్ నుంచి కంటిని కాపాడుతుంది. దీంతో మన కళ్ళు డామేజ్ కాకుండా వయస్సురీత్యా వచ్చే సమస్యలను అధిగమించవచ్చు. అవకాడో తీసుకోవడం వల్ల కంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఇందులో విటమిన్ ఏ ఉంటుంది. అంతేకాదు ఇది రేచీకటి సమస్య కూడా మంచి మందు.
అవకాడోలో గ్లైసెమిక్ సూచీ కూడా తక్కువగా ఉంటుంది. దీంతో షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది మేలు చేస్తుంది. రక్తంలో చక్కర స్థాయిలు హఠాత్తుగా పెరగకుండా కాపాడుతుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు ఫైబర్ ఉంటుంది. షుగర్ హఠాత్తుగా పెరగకుండా నివారిస్తుంది.
అవకాడో ఎముకల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ కె, మెగ్నీషియం, పొటాషియం ఉంటుంది. ఎముక ఆరోగ్యకరమైన ఎదుగుదలకు విటమిన్ కే ఎంతో అవసరం. క్యాల్షియం కూడా ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది. మెగ్నీషియం అవకాడోలో పుష్కలంగా ఉండటం వల్ల ఆస్టియోపోరోసిస్ రాకుండా నివారిస్తుంది. మన రెగ్యులర్ డైట్ లో కాల్షియం తీసుకున్నట్లు అవుతుంది.
ఇదీ చదవండి: భానుడి భగభగలు షురూ.. నేటి నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు..
అంతేకాదు అవకాడో తీసుకోవడం వల్ల మెదడు పనితీరు కూడా మెరుగవుతుంది. ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలెట్ మన శరీరం నుంచి మంచి రక్త సరఫరాను కూడా నిర్వహిస్తుంది. మెదడు పనితీరు కూడా ప్రేరేపిస్తుంది. అవకాడోలో ఫోలెట్ ఉండటం వల్ల మెదడు అభిజ్ఞ సమస్యలు రాకుండా కాపాడుతుంది.
అవకాడో తీసుకోవడం వల్ల ప్రాణాంతక వ్యాధులు కూడా మన దరిచేరకుండా ఉంటాయి. ముఖ్యంగా గుండె, ఆర్థరైటిస్, క్యాన్సర్ సమస్యలు రాకుండా నివారిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్ కెరొటినాయిడ్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉండటం వల్ల ప్రాణాంతక వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు ..
ఇదీ చదవండి: బడ్జెట్లో పెరగని పీఎం కిసాన్ నిధి.. 19వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా?
ఇక ఆరోగ్యపరంగా మాత్రమే కాదు అవకాడో తీసుకోవడం వల్ల చర్మం, జుట్టుకు కూడా మేలు జరుగుతుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఇ, విటమిన్ సి ఉండటం వల్ల చర్మానికి హైడ్రేషన్ అందుతుంది. సాగే గుణం కలిగి ఉంటుంది. అంతే కాదు ఫ్రీ రాడికల్ డామేజ్ కాకుండా నివారిస్తుంది. ముఖంపై మచ్చలు గీతాలు రాకుండా నివారిస్తుంది. అంతేకాదు అవకాడోలో ఉన్న బయోటిన్ జుట్టు బలంగా మెరిసేలా చేస్తుంది. దీంతో హెయిర్ సమస్యలు రాకుండా నివారిస్తుంది. మన రెగ్యులర్ డైట్ లో అవకాడో ఉండటం వల్ల చర్మం కూడా మెరుస్తూ ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.