Kerala boy wants anganwadi to serve biryani: సాధారణంగా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చాలా మంది అంగన్వాడీ స్కూళ్లకు పంపిస్తారు. దీంతో పిల్లలకు మెల్ల మెల్లగా స్కూల్ వాతావరణం అలవాటు అవుతుంది. అయితే.. ప్రభుత్వాలు కూడా అంగన్వాడీలో గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు ప్రత్యేకంగా ప్రతినెల పోషక పదర్ధాలను పంపిణి చేస్తుంటారు. ముఖ్యంగా అంగన్వాడీలలో ఆరేళ్ల లోపు పిల్లలకు పాలు, గుడ్లు వంటివి పంపిణి చేస్తుంటారు.
పిల్లలకు, ప్రెగ్నెంట్ లేడీస్ కు పోషకాలను అందేలా చర్యలు తీసుకుంటారు. అయితే.. కేరళలో ఒక బాలుడు తనకు అంగన్వాడీలో ఉప్మా వద్దని, చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై కావాలంటూ తన తల్లితో క్యూట్ గా రిక్వెస్ట్ చేశాడు. దీన్ని ఆ తల్లి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ఇది కాస్త వైరల్ కావడంతో పిల్లాడి కోరిక ప్రభుత్వ పెద్దల వరకు వెళ్లింది. దీనిపై ఏకంగా కేరళ ఆరోగ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి వీణా జార్జ్ స్పందించారు.
பிரியாணியும், பொரிச்ச கோழியும் வேண்டும்; குழந்தையின் வேண்டுகோளை ஏற்ற கேரள அரசு
அங்கன்வாடி உணவில் உப்புமாவிற்கு பதிலாக பிரியாணியும், வறுத்த சிக்கனும் கொடுக்க வேண்டும் என வீடியோ மூலம் கோரிக்கை வைத்த ஷங்கு என்ற சிறுவன்.
கோரிக்கை ஏற்று கொள்கிறோம். விரைவில் முடிவெடுக்கிறோம் அமைச்சர் pic.twitter.com/SQJr31OPUH— Pudukkottai Page (@pudukkottai_pag) February 4, 2025
వైరల్గా మారిన వీడియోలో టోపీ ధరించిన త్రాజుల్ ఎస్ శంకర్(శంకు) అనే బాలుడు తన తల్లితో క్యూట్ గా తనకు బిర్యానీ, చికెన్ ఫ్రై కావాలని, ఉప్మా వద్దని చెప్తాడు. దీనిపై మంత్రి వీణ జార్జ్ స్పందించారు. బాలుడి రిక్వెస్ట్ ను తాము పరిగణలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాకుండా.. అతి తొందరలోనే.. ప్రభుత్వం పెద్దల వరకు దీన్ని తీసుకెళ్లి.. అంగన్వాడీ పిల్లలకు అందించే మెనులో మార్పులు తీసుకొస్తామని చెప్పారు.
అదే విధంగా వైరల్ అవుతున్న వీడియోకు నెటిజన్ ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా మంది పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు ముందుకు వస్తున్నారు. చిన్నారుల కోరిక తీర్చడం ప్రభుత్వాల బాధ్యత అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.కేరళలో 2022 నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు గుడ్లు, పాలను అందిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter