Woman sells husband kidney in west bengal: ఇటీవల కాలంలో సమాజంలో తరచుగా వివాహేతర సంబంధాలు వార్తలలో ఉంటున్నాయి. పెళ్లిబంధానికి ఉన్న గొప్పతనాన్ని కొంత మంది దిగజారుస్తున్నారు. కొంత మంది పురుషులు, మహిళలు పెళ్లి చేసుకుని మరీ ఎఫైర్ లను పెట్టుకుంటున్నారు. భర్త ఆఫీసుకు వెళ్లగానే భార్యలు ఇలాంటి పాడుపనులు చేస్తున్నారు. మరోవైపు ఆఫీసులకని చెప్పి భర్తలు కూడా, అక్కడ కూడా తోటి సిబ్బందితో ఎఫైర్ లు పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ లోని హౌరాలో చోటు చేసుకున్న ఘటన పెనుదుమారంగా మారింది.
హౌరాలో ఉంటున్న మహిళకు, బారక్ పూర్ లో ఉంటున్న యువకుడికి ఫెస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి, వివాహేతర సంబంధంగా మారింది. ఈ నేపథ్యంలో సదరు మహిళ తన ప్రియుడితో పారిపోవాలని ప్లాన్ చేసింది. అప్పటికే ఆమెకు కూతురు కూడా ఉంది.
అయితే.. వీళ్ల కుటుంబం చాలా పేదరికంలో ఉన్నారు. తరచుగా భర్తకు కూతురు, చదువు, పెళ్లి గురించి బ్రైన్ వాష్ చేసేది. అంతే కాకుండా.. కిడ్నీ అమ్మితే.. వచ్చిన సొమ్మును బ్యాంక్ లో , చిట్టిలు కడితే ఇంట్రెస్ట్ బాగా వస్తుందని ఇది భవిష్యత్తులు ఉపయోగపడుతుందని భర్తను టార్చర్ చేసింది.
డైలీ భర్తను ఇలా వేధించడంతో.. చివరకు భార్యమాటల్ని అతగాడు నమ్మి.. కిడ్నీ అమ్మేందుకు రెడీ అయ్యాడు. అప్పటికే కిడ్నీకోసం చూస్తున్న దళారులను పట్టుకుని పది లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్లి కిడ్నీశస్త్ర చికిత్స నిర్వహించారు. అప్పటికే ప్రియుడితో రెడీగా ఉన్న సదరు మహిళ డబ్బులు తీసుకుని పరిపోయింది. అసలు విషయం ఆలస్యంగా తెలుసుకున్న భర్త లబోదిబో మన్నాడు.
సదరు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి లోకేషన్ ట్రేస్ చేయగా.. వాళ్లిద్దరు.. బారక్ పూర్ లోని ఒక ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. ఇంటి ముందుకు వెళ్లి భర్త, కూతురు బైటకు రావాలని చెప్పగా ఆమె రావడానికి నిరాకరించింది.
Read more: Monalisa Video: అయ్ పాయ్.. కుంభమేళను వదిలి వెళ్లిపోతున్న మోనాలీసా... ఎమోషనల్ వీడియో వైరల్..
కనీసం తల్లిదండ్రులు వచ్చిన కూడా రాలేదు. తనను వేధిస్తున్నారని, విడాకులు ఇచ్చేస్తానని స్పష్టం చేసింది. దీంతో చేసేదిలేక సదరు భర్త, కుటుంబ సభ్యులు వెనుదిరిగారు. కూతురు భవిష్యత్తు కోసం అని చెప్పి, తన భార్య చేసిన మోసం పట్ల కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter