Jana Nayagan: విజయ్ రాజకీయ పార్టీ పెట్టి పూర్తి స్థాయి పాలిటిక్స్ కే పరిమితం కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన యాక్ట్ చేస్తోన్న చివరి సినిమా మీద అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. దళపతి 69 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని షురూ చేశారు. గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ‘జన నాయగన్’ అనే టైటిల్ ను అనౌన్స్ చేసారు. జన నాయగన్ అంటే జన నాయకుడు అనే అర్ధం. ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. హెచ్ వినోద్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.
జన నాయగన్ అనే టైటిల్‌తో దళపతి విజయ్ తమిళ చిత్ర పరిశ్రమలో వైబ్రేట్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇది ఆయన చివరి చిత్రంగా ప్రచారం చేస్తున్నారు.ఈ టైటిల్ పోస్టర్‌లో దళపతి విజయ్ ఎంతో క్యూట్ గా స్మార్ట్‌గా కనిపిస్తున్నారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు.. ఈ పోస్టర్‌లోని సెల్ఫీకి, ఆ టైటిల్‌కి న్యాయం చేసినట్టుగా కనిపిప్తోంది. ఈ చిత్రానికి విజయ్‌కి ఫేర్ వేల్‌గా ఉండబోతోంది. అభిమానులు ఈ సినిమాను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకునేలా ఉంటుందని చెబుతున్నారు.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఇక ఈ మూవీ టైటిల్ అర్థం అందరికీ తెలిసిందే. జన నాయకుడు.. పీపుల్స్ లీడర్.. ప్రజా నాయకుడు అని అర్థం వచ్చే రీతిలో ఆయన రాజకీయ అరంగేట్రానికి పనికి వచ్చేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇన్నేళ్లలో విజయ్ చేసిన సేవా కార్యక్రమాలు, సినీ పరిశ్రమలో సాధించిన విజయాలకు చిహ్నంగా ఈ టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంతో అనిరుధ్ మరోసారి తన సంగీతంతో విజయ్ అభిమానుల్ని ఉర్రూతలూగించేందుకు రెడీ అవుతున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నారు. అదిరిపోయే లైనప్‌తో కేవీఎన్ ప్రొడక్షన్స్ మున్ముందు మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను అందించనుంది.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.