Ghee Coffee Benefits: నేటికాలంలో చాలామంది అధిక బరువు, జుట్టు రాలే సమ్యస, మలబద్దకం, గుండె జబ్బులు వంటి ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పెడుతున్నారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడం కోసం వివిధ రకాల మందులకు ఉపయోగిస్తారు. కానీ ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం రెండే రెండు పదార్థాలతో అన్ని రకాల ఆరోగ్యసమస్యలకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. గీ కాఫీ ప్రస్తుతం సినీ తారల నుంచి ఆరోగ్యనిపుణుల వరకు ఈ పానీయాన్ని తాగుతున్నారు. ఇందులో నెయ్యి, కాఫీ పొడిని ఉపయోగిస్తారు. దీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇందులో శరీరానికి కావాల్సిన ఆరోగ్యలాభాలు బోలెడు ఉన్నాయి. ఈ కాఫీ తాగడం వల్ల ఎలాంటి అనారోగ్యసమస్యల నుంచి బయటపడవచ్చు అనేది మనం తెలుసుకుందాం.
గీ కాఫీలో నెయ్యిని ఉపయోగిస్తాము. నెయ్యి ఆరోగ్యానికి ఒక ఔషధం వంటిది. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా బ్యూటిరిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల ఇది పేగు సంబంధిత సమస్యలను తగ్గించి బౌల్ మూమెంట్‌ను మెరుగుపరుచుతుంది. దీని వల్ల జీర్ణక్రియ వ్యవస్థ సాఫీగా ఉంటుంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఈ కాఫీ తాగడం వల్ల సమస్య నుంచి విముక్తి కలుగుతుంది. బరువు తగ్గించడంలో కూడా ఈ కాఫీ కీలక ప్రాత పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కేలరీలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కూడా గీ కాఫీ ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. గీ కాఫీ లో వివిధ రకాల విటమిన్‌లు ఉంటాయి. అందులో ముఖ్యంగా విటమిన్ ఎ, ఇ, కె అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో అవసరమైనవి. ఇది పొట్టపైన పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో కీలక ప్రాత పోషిస్తుంది. అలాగే మానసిక స్థితిని మెరుగుపరచడంలో కూడా గీ కాఫీ ఎంతో సహాయపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మీరు కూడా ఈ కాఫీని ఇంట్లోనే తయారు చేసుకోవాలి అనుకుంటే ఈ టిప్స్‌ను ఫాలో అవ్వండి.
గీ కాఫీ తయారీ విధానం:
కావాల్సిన పదార్థాలు: నెయ్యి- 2 స్పూన్‌లు, కాఫీ పొడి, బ్లెండర్
తయారీ విధానం: ముందుగా ఒకటి లేదా రెండు స్పూన్‌ల కాఫీ పొడిని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పొడిని వేడి నీటిలో కలుపుకోవాలి. ఈ నీరు మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాల్సి ఉంటుంది. ఈ నీరు కాగనిచ్చిన తరువాత పాలు కలుపుకోవాల్సి ఉంటుంది. అంతే ఎంతో సింపుల్ గీ కాఫీ రెడీ.
Also read: HMPV Alert: బెంగళూరులో చైనా వైరస్, అప్రమత్తమైన పొరుగు రాష్ట్రాలు, హై అలర్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.