Bank Holidays 2025: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా బ్యాంకు సెలవు జాబితా విడుదల చేస్తుంటుంది. ఇప్పుడు మార్చ్ నెల సెలవుల జాబితా వచ్చేసింది. మార్చ్ నెలలో ఏకంగా 12 రోజులు బ్యాంకులకు సెలవులున్నాయి. ఇందులో ప్రాంతీయ,జాతీయ సెలవులు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు నాలుగు ఆదివారాలతో పాటు రెండు, నాలుగు శనివారాలు సెలవులు ఉంటాయి. మార్చ్ నెలలో బ్యాంకులు 12 రోజులు మూతపడనున్నాయి. ఈ సెలవులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. మీకు ఒకవేళ మార్చ్ నెలలో బ్యాంకు పనులుంటే సెలవులు ఎప్పుడనేది తెలుసుకుంటే మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది.
మార్చ్ 2 ఆదివారం సెలవు
మార్చ్ 7 శుక్రవారం ఐజ్వాల్‌లో సెలవు
మార్చ్ 8 రెండవ శనివారం సెలవు
మార్చ్ 13 డెహ్రాడూన్, కాన్పూర్,లక్నో,రాంచీలో సెలవు
మార్చ్ 14 పశ్చిమ బెంగాల్లో సెలవు
మార్చ్ 15 అగర్తల, భువనేశ్వర్, ఇంఫాల్, పాట్నాలో సెలవు
మార్చ్ 16 ఆదివారం సెలవు
మార్చ్ 22 నాలుగో శనివారం సెలవు
మార్చ్ 23 ఆదివారం సెలవు
మార్చ్ 28 జుమ్మతుల్ విదా, జమ్ము కాశ్మీర్లో సెలవు
మార్చ్ 30 ఆదివారం సెలవు
Also read: Champions Trophy 2025: ఇండియా పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ రేపే, హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి